గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ రాస్తారోకో
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:15 AM
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ,బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ విక్రయాలను అరికట్టాలని డిమాండ్‌చేస్తూ సోమవారం పట్టణంలోని కోల్‌బెల్ట్ రోడ్డుపై సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
మందమర్రిటౌన్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ,బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ విక్రయాలను అరికట్టాలని డిమాండ్‌చేస్తూ సోమవారం పట్టణంలోని కోల్‌బెల్ట్ రోడ్డుపై సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు భీమనాధుని సుదర్శన్ మాట్లాడుతూ ఇరాన్‌పై యుద్దం ఆపాలని డిమాండ్ చేశారు. యు ద్దాలతో ఇతర దేశాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అమె రికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు మంచివి కావన్నారు. దేశంలో గ్యాస్, నిత్యవసర సరుకులు ధరలు పెరుగుతున్నాయని, దీన్ని నియంత్రించకపోతే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు బతకలేని పరిస్థితులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కామని దుర్గరాజ్,మిట్టపల్లి పౌలు, సత్యనారాయణ, జనార్ధన్, వెంకన్న, రాజేశం, మేరుగు రాజేశం, ఆంటోని దినేష్, దొంతుల రాజం పాల్గొన్నారు.