Share News

ఇంకెంత కాలం కాళేశ్వరంపై చర్చ?: కూనంనేని

ABN , Publish Date - Mar 30 , 2026 | 05:16 AM

ఇంకెంత కాలం కాళేశ్వరంపై చర్చలు కొనసాగిస్తారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వినీ వినీ ప్రజలకు విసుగు పుడుతోందని...

ఇంకెంత కాలం కాళేశ్వరంపై చర్చ?: కూనంనేని

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఇంకెంత కాలం కాళేశ్వరంపై చర్చలు కొనసాగిస్తారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వినీ వినీ ప్రజలకు విసుగు పుడుతోందని, దానిపై వస్తున్న ఆరోపణలకు పరిష్కారం చూపాలని సూచించారు. ఆదివారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లకపోతే ప్రజాధనం వృథా అవుతుందన్నారు. ఏ నిధులైనా నియోజక వర్గాల వారీగా సమానంగా ఇస్తే రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు.

Updated Date - Mar 30 , 2026 | 05:16 AM