Share News

పొత్తు ధర్మానికి కాంగ్రెస్‌ విఘాతం

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:11 AM

కాంగ్రెస్‌ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇందుకు విఘాతం కలిగించిందన్నారు...

పొత్తు ధర్మానికి కాంగ్రెస్‌ విఘాతం

  • సీఎం రేవంత్‌ వద్దే తేల్చుకుంటాం : కూనంనేని

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్ర జ్యోతి): కాంగ్రెస్‌ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇందుకు విఘాతం కలిగించిందన్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయాన్ని నేరుగా సీఎంతోనే తేల్చుకుంటామన్నారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో మంగళవారం రాష్ట్ర స్థాయి కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి ఎన్నికల్లో సీపీఐ బలాన్ని చాటుకోవడంతోపాటు.. తమతో పొత్తు లేకపోతే పరిస్థితెలా ఉంటుందో పార్టీలకు తెలిసేలా చేశామన్నారు. అధికార పార్టీతో పొత్తున్నా లేకున్నా ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తామని కూనంనేని అన్నారు. కమ్యూనిస్టులు కోరుకునే సమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకుందామని, జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు మాతృ పార్టీ సీపీఐలో చేరాలని కోరారు. జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం విదేశీ దౌత్య విధానంలో విఫలమైందన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 05:11 AM