ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:56 AM
ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు.
సీఎం రేవంత్‌రెడ్డికి కూనంనేని లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, వేతన సవరణల అమలు, గుర్తింపు సంఘాల ఎన్నికలు, కార్మికులకు ఉద్యోగ భద్రత, కొత్త బస్సులు కొనుగోలు చేసి సంస్థను విస్తరించడం వంటి ప్రభుత్వ హామీలేవీ అమలుకాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.