అగ్రరాజ్య ఉన్మాదంపై మోదీ మౌనం వీడాలి
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:25 AM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ వహిస్తున్న మౌనం మన దేశ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందని సీపీఐ జాతీయ కంట్రోల్...
అమెరికా చర్యల వల్ల రైతులకు నష్టం
కేసీఆర్ పేటెంట్ ఖతం
పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
సీపీఐ నేత కె.నారాయణ
నయీంనగర్, ములుగు టౌన్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీ వహిస్తున్న మౌనం మన దేశ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ విమర్శించారు. హనుమకొండలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధకాంక్ష వల్ల ప్రపంచ దేశాలతో పాటు భారత్ తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ వాతావరణం వల్ల ఇంధన ధరలు పెరగడమే కాకుండా దేశ రైతులు పండించే బియ్యం, పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోతాయని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ తన కేబినెట్‌లో తెలంగాణ వ్యతిరేకులకు చోటు ఇవ్వడం ద్వారా తెలంగాణ తెచ్చారన్న పేటెంట్ హక్కులను కోల్పోయారన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు. ఆ వైఫల్యాలను ఎండగట్టేందుకే ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివా్‌సతో కలిసి నారాయనణ ప్రారంభించారు. పార్టీ బలోపేతం కోసం చేపట్టిన నిధుల సమీకరణలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.