సీఆర్ ఫౌండేషన్‌లో మా వృద్ధాశ్రమం విలీనం
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:01 AM
సామాజిక మాధ్యమాల్లో తాను వృద్ధాశ్రమాన్ని దానం చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీపీఐ సీనియర్ నాయకుడు కె. నారాయణ ..
సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పష్టీకరణ
హైదరాబాద్, జూన్ 13( ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో తాను వృద్ధాశ్రమాన్ని దానం చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీపీఐ సీనియర్ నాయకుడు కె. నారాయణ స్పష్టం చేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో 25 సెంట్ల స్థలం, ఇల్లు విక్రయించి సుమారు రూ.3 కోట్లతో బాకరాపేట వద్ద 3 ఎకరాలు కొనుగోలు చేసి 2022 అక్టోబరు 1న వృద్ధాశ్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. సుమారు 15 మంది వృద్ధులు ఆశ్రమంలో ఉండేవారని, అయితే వ్యక్తిగతంగా ఆశ్రమాన్ని నిర్వహించడంలో ఇబ్బందులు రావడంతో సీఆర్ ఫౌండేషన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో విలీనం చేసినట్లు ఆయన వివరించారు.