కమ్యూనిస్టు భావజాలమంటే నియంతలకు భయం
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:57 AM
చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం పెద్దగా లేకపోయినా మోదీ మొదలు ట్రంప్ వరకు నియంతలంతా మార్క్సిస్టు సిద్ధాంతానికి భయపడుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వ్యాఖ్యానించారు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా
సురవరం సుధాకర్‌రెడ్డి స్వీయకథ ‘ప్రజలతో నా ప్రయాణం’ ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీ, మార్చి25(ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం పెద్దగా లేకపోయినా మోదీ మొదలు ట్రంప్ వరకు నియంతలంతా మార్క్సిస్టు సిద్ధాంతానికి భయపడుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వ్యాఖ్యానించారు. అందుకే వారంతా కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రమాదకరమైనదిగా, తీవ్రమైనదిగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి 84వ జయంతి సందర్భంగా బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన స్వీయకథ ‘ప్రజలతో నా ప్రయాణం’ పుస్తకాన్ని డి.రాజా ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు విశ్రాంత జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ సురవరం జీవితమంతా ప్రజల ఉఛ్వాసనిశ్వాసాలతో పెనవేసుకుందన్నారు. సురవరాన్ని గొప్ప సుగుణశీలిగా సభాధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభివర్ణించారు. సురవరంతో తనకున్న అనుబంధాన్ని తలచుకొని తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షుడు కె. శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. స్వాతం త్య్ర సమరయోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, సురవరం జీవిత సహచరి విజయలక్ష్మి తదితరులంతా ప్రజా పోరాటాల్లో సురవరం పాత్రను వివరిస్తూ ప్రసంగించారు.