బీజేపీకి 400 సీట్లు వచ్చుంటే రాజ్యాంగాన్ని మార్చేసేది: సీపీఐ
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:45 AM
బీజేపీ ఆశించినట్లుగా పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే ఈ పాటికే రాజ్యాంగాన్ని తిరగరాసేసేదని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి విమర్శించారు.
హైదరాబాద్, జనవరి 26(ఆంధ్ర జ్యోతి): బీజేపీ ఆశించినట్లుగా పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే ఈ పాటికే రాజ్యాంగాన్ని తిరగరాసేసేదని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి విమర్శించారు. మెజారిటీ రాకపోవడం వల్ల రాజ్యాంగం బతికిపోయిందని వ్యాఖ్యానించారు. సోమవారం మఖ్దూంభవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఆర్‌ఎ్‌సఎస్ కనుసన్నల్లో బీజేపీ పాలన సాగిస్తోందన్నారు. బీజేపీ వచ్చిన తరువాత రాష్ట్రాలు స్వేచ్ఛను కోల్పోయాయని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతంగా పని చేస్తున్న గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలందరికి చెందాల్సిన దేశ సంపదను బీజేపీ కొంత మంది చేతిలో పెడుతోందని అన్నారు. ప్రజలను మత విద్వేషాలవైపు మళ్లిస్తూ అరాచక పాలనను కొనసాగిస్తోందని చెప్పారు.