Share News

D Raja urged: స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో.. మరో వందేళ్లు పోరాటాలకు సిద్ధం

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:33 AM

వందేళ్లుగా దేశంలో సీపీఐ సాగించిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలతో పాటు నాటి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో మరో వందేళ్లు భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధం కావాలని ...

D Raja urged: స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో.. మరో వందేళ్లు పోరాటాలకు సిద్ధం

  • లౌకిక శక్తులతో కలిసి బీజేపీని ఓడిస్తాం

  • సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా

ఖమ్మం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ ఖమ్మం కలెక్టరేట్‌ : వందేళ్లుగా దేశంలో సీపీఐ సాగించిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలతో పాటు నాటి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో మరో వందేళ్లు భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధం కావాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాటం సాగిస్తూనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులతో కలిసి ముందుకుసాగుతామని ప్రకటించారు. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌, సీపీఐలు రెండూ ముందున్న పార్టీలని, ఆర్‌ఎ్‌సఎస్‌ ఏ పాత్రా పోషించలేదని, వారు వలస పాలకులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సీపీఐ వందేళ్ల ప్రయాణం సాదాసీదా ప్రయాణం కాదని, అద్భుత పోరాటాలు, అత్యున్నత త్యాగాలతో కూడినదని, ఇది ప్రతీ కార్యకర్త, నాయకుడు గర్వించాల్సిన విషయమన్నారు. ఆదివారం ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ నిర్వహించారు. 2024 డిసెంబరు 26న కాన్పూర్‌లో ప్రారంభమైన శతాబ్డి ఉత్సవాలను ఖమ్మంలో ముగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డి.రాజా మాట్లాడుతూ భారతీయ కమ్యూనిస్టులుగా స్వాతంత్య్రం కోసం పోరాడమని, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ అండగా నిలిచిందన్నారు. ప్రపంచంలో పలు దేశాలపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తనకు తాను డిక్టేటర్‌గా, హిట్లర్‌గా భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ట్రంప్‌ భారతదేశాన్ని నిందిస్తుంటే మోదీ నోరు మెదపడం లేదని విమర్శించారు.

Updated Date - Jan 19 , 2026 | 04:33 AM