Share News

సీట్ల సర్దుబాటు సమస్యతోనే విడిగా పోటీ

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:01 AM

కాంగ్రె్‌సకు, సీపీఐకి మధ్య ఎలాంటి వైరం లేదని, కేవలం సీట్ల సర్దుబాటు విషయంలో సంఖ్యాపరమైన సమస్య తలెత్తడంతోనే మునిసిపల్‌ ఎన్నికల్లో విడిగా పోటీ చేయాల్సి వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని.....

సీట్ల సర్దుబాటు సమస్యతోనే విడిగా పోటీ

  • కాంగ్రెస్‌, సీపీఐ మధ్య ఎలాంటి వైరం లేదు: కూనంనేని

కొత్తగూడెం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సకు, సీపీఐకి మధ్య ఎలాంటి వైరం లేదని, కేవలం సీట్ల సర్దుబాటు విషయంలో సంఖ్యాపరమైన సమస్య తలెత్తడంతోనే మునిసిపల్‌ ఎన్నికల్లో విడిగా పోటీ చేయాల్సి వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెంలోని సీపీఐ కార్యాలయంలో దళిత సంఘాల ఐక్య సంఘటిత వేదికతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారం కోసం కక్కుర్తి పడితే.. ఎప్పుడో మంత్రులయ్యేవాళ్లమని, ఎర్రజెండా నేతలు ప్రధాని పదవిని సైతం ప్రజల కోసం పక్కకు పెట్టారన్నారు. ‘ప్రభుత్వం మాదే, ఎమ్మెల్యేది ఏముంది’ అని అంటున్న వారికి ఎమ్మెల్యే బాధ్యతలేంటో తెలియవా? అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులది ఏముందిలే అనడం అవివేకమని, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరి పనులు వారివేనన్నారు. ప్రస్తుత కార్పొరేషన్‌ ఎన్నికల్లో కమ్యూనిస్టు కూటమి గాలి వీస్తోందన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌ సాధించుకోవడం ద్వారా చిరకాల స్వప్నం సాకారమైందని, తద్వారా అనూహ్యమైన అభివృద్ధి జరగనుందన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 04:01 AM