మొదలైన ఇళ్ల గణన
ABN , Publish Date - May 13 , 2026 | 01:24 AM
భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన కార్యక్రమంలో భాగంగా మొదట ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు చేపట్టనున్న ఇళ్ల గణన ప్రారంభమైంది. మొదటి మూడు రోజుల పాటు సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు తమకు కేటా యించిన బ్లాకుల్లో
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన కార్యక్రమంలో భాగంగా మొదట ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు చేపట్టనున్న ఇళ్ల గణన ప్రారంభమైంది. మొదటి మూడు రోజుల పాటు సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు తమకు కేటా యించిన బ్లాకుల్లో ఇళ్లను గుర్తించి మ్యాపింగ్ చేసుకుం టున్నారు. రెండు రోజులుగా ఆ ప్రక్రియ కొనసాగు తున్నది. ఈ నెల 14వ తేదీ నుంచి 33 అంశాల్లో ఇళ్ల గణనలో అందులో నివసిస్తున్న యజమాని ద్వారా వివరాలు నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా డిజిటల్‌లోనే కొనసాగనున్నది. దీనికంటే ముందు గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఆయా ఇళ్ల యజమానులు తమ వివరాలను నమోదు చేసు కునేందుకు స్వీయగణన కోసం ఒక యాప్‌ను రూపొం దించారు. ఆ యాప్ ద్వారా స్వీయగణన చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రచారం చేసినప్పటికీ, ఇదే మొదటిసారి కావడంతో అంతగా స్పందించ లేదు. జిల్లా వ్యాప్తంగా స్వీయగణన 3 శాతం వరకు జరిగి ఉం టుంది. ఇళ్ల గణన కోసం జిల్లాలో 1548 హౌస్ లిస్టింగ్ జోన్లను గుర్తించారు. ఒక జోన్‌లో 300 ఇళ్లు, 800 జనాభా ఉంటారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ పరిధిలో 77 మంది సూపర్‌వైజర్లు, 460 మంది ఎన్యూమరేటర్లను నియ మించారు. ఇతర మున్సిపాలిటీలు, మండలాల్లో 279 సూపర్‌వైజర్లు, 1174 మంది ఎన్యూమరేటర్లను నియ మించారు. వీరికి బ్యాచుల వారీగా మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 4,64,400 వరకు ఇళ్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పూర్తిస్థాయిలో జనగణన చేపట్టను న్నారు. మొదట చేపట్టనున్న ఇళ్ల గణన 33 అంశాల్లో జరగనున్నది.
ఫ 33 అంశాల్లో ఇళ్ల గణన..
జనాభా లెక్కల్లో భాగంగా మొదట చేపట్టనున్న ఇళ్ల గణనలో 34 అంశాల్లో వివరాలు నమోదు చేయను న్నారు. ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శిస్తారు. ముందుగా ఇంటి స్వరూపం గురించి వివరాలు నమో దు చేసుకుంటారు. గుడిసె, పెంకులు, స్లాబ్ గదుల సంఖ్య, జీ ప్లస్ వన్, అంతకు పైగా ఉన్నటువంటి వివరాలను నమోదు చేసుకుంటారు. ఇంటి నంబరు.. జనగణన జాబితాలో కేటాయించిన నంబరు, ఇంటిలో ఫ్లోర్‌కు వాడిన మెటీరియల్, ఇంటి గోడల నిర్మాణంలో ప్రధానంగా వాడిన మెటీరియల్, ఇంటి పైకప్పులో వాడిన మెటీరియల్, ఇంటిని ఎలా వాడుతున్నారు, (రెసిడెన్షియల్, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఖాళీగా ఉందా), ఇల్లు ఆవాసయోగ్యంగా ఉందా? శిథిలావస్థలో ఉందా, కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత, ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వారెంత మంది, ఇంటి పెద్ద పేరు, ఇంటి పెద్ద మహిళా, పురుషుడా అని నమోదు చేయాలి. ఇంటి పెద్ద ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర సామాజిక వర్గానికి చెందినవారా, ఉంటున్న ఇల్లు సొంతమా, అద్దె ఇళ్లు, ఇంట్లో ఎన్ని గదులు వాడుకుంటున్నారో నమోదు చేస్తారు. ఇంట్లో పెళ్లయిన జంటలు ఎన్ని ఉన్నాయి, తాగునీటి కోసం ప్రధానంగా దేనిపై ఆధారపడుతు న్నారు, తాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయా, ఇంట్లో విద్యుత్ అవసరాలకు ఏ వనరులు ఉపయో గిస్తున్నారో నమోదు చేస్తారు. అలాగే విద్యుత్, సోలార్ విద్యుత్, ఇతర మార్గాలు, మరుగుదొడ్లు ఇంట్లోనే ఉన్నాయా, ఏ రకమైన మరుగుదొడ్లు, ఇంటికి డ్రైనేజీ వ్యవస్థ, బాత్రూమ్‌లకు పైకప్పు ఉందా, డైన్రేజీ, కిచెన్, ఎల్పీజీ/పీఎన్జీ వాడుతున్నారా, టీవీ, ఇంటర్నెట్ కనెక్షన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు, టెలిఫోన్, స్మార్ట్ ఫోన్ల్లు ఎన్ని ఉన్నాయి, ద్విచక్ర వాహనాలు, కారు, జీపు, వ్యాన్ ఎన్ని ఉన్నాయి,. ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యాలు ఏవి, ఫోన్ నంబరు నమోదు చేయనున్నారు. వచ్చే ఫిబ్రవరి నెల నుంచి జనగణన చేపట్టనున్నారు.