చేతులు మారుతున్న నకిలీ కరెన్సీ
ABN , Publish Date - Mar 30 , 2026 | 10:47 PM
జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి యథేశ్ఛగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి అక్రమ మా ర్గంలో జిల్లాకు చేరుతున్న నకిలీ కరెన్సీ ఇక్కడి కొందరు ఏజెంట్ల సహాయంతో స్థానికంగా చలామణి అవుతోం ది.
లక్షెట్టిపేటలో వెలుగు చూసిన అక్రమ బాగోతం
గతంలో మంచిర్యాలలో తయారీ కేంద్రం ఏర్పాటు
తాజాగా లక్షెట్టిపేటలో పట్టుబడ్డ నగదు
మంచిర్యాల, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి యథేశ్ఛగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి అక్రమ మా ర్గంలో జిల్లాకు చేరుతున్న నకిలీ కరెన్సీ ఇక్కడి కొందరు ఏజెంట్ల సహాయంతో స్థానికంగా చలామణి అవుతోం ది. ఈ విషయమై కూపీ లాగిన పోలీసులు పక్కా ప్ర ణాళికతో నకిలీనోట్ల చలామణి ముఠాను అరెస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ జి ల్లాలో నకిలీ కరెన్సీ చలామణి సంఘటనలు చోటు కో గా, ఇటీవల మళ్లీ అక్రమ దందా ఊపందుకుంది. గ తంలో జైపూర్ మండల కేంద్రంగా నకిలీ నోట్ల చలామణి సంఘటన చోటు కోగా నిందితులను పోలీసులు అ దుపులోకి తీసుకున్నారు. టర్కీ ప్రభుత్వం రద్దు చేసిన కరెన్సీ నోట్లు కోట్లాది రూపాయలను జిల్లాలో తారుమారు చేసేందుకు ముఠా సభ్యులు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నకిలీ కరెన్సీ చలామణికి ప్ర యత్నించి పట్టుబడ్డ నిందితులు ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారు కాగా వారి నుంచి కోట్ల విలువ గలకరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ క రెన్సీ చలామణి చేయడం కోసం మధ్యవర్తి ద్వారా మండలంలోని ఇందారం గ్రామానికి వచ్చిన నిందితు లు పాగాల పున్నంకు రూ. కోటి 13 లక్షల టర్కీ కరెన్సీ చూపించి రూ. 50 వేలతో బేరం కుదుర్చుకోగా, తీగలాగిన పోలీసులు నిందితుల వద్ద చలామణిలోలేని టర్కీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో తూర్పు గోదావరి జిల్లా రాయవరం గ్రామానికి చెందిన పడాల వెంకట రామక్రిష్ణ, ముమ్మిడివరం మండలం సొమ్మిదేవరపాలెంకు చెందిన గుత్తుల క్రిష్ణకళ్యాన్, క ట్రేనికొండి గ్రామానికి చెందిన నల్ల మోహన్‌కుమార్ లతో పాటు హైదరాబాద్‌లోని మీర్‌పేట్ ఏరియాకు చెందిన శేక్ మనోరఫీ, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రా మానికి చెందిన విసనగిరి చంద్రశేఖర్‌లు ఉన్నారు.
మంచిర్యాలలో తయారీ కేంద్రం....
జిల్లా కేంద్రంలోని సున్నంబట్టి వాడలో నకిలీ నోట్ల తయారీ కేంద్రంపై 2016లో పోలీసులు దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు కంప్యూటర్, ప్రింటర్, తదితర సామగ్రిని స్వాధీనం చేసు కోవడం కలకలం రేపింది. స్థానికంగా ఓ ఇల్లు కిరాయి కి తీసుకొన్న కొందరు వ్యక్తులు నకిలీ కరెన్సీ నోట్లను త యారు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేయడంతో ముఠా గుట్టురట్టయింది. సీసీసీకి చెందిన బొమ్మెన రా జశేఖర్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి దొంగ నో ట్లు తయారు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రాజశేఖర్‌తోపాటు అతని మిత్రులు బేరం చంద్రయ్య, ముంజం సతీష్, పూదరి శ్రావన్‌లను పోలీసులు అరె స్టు చేశారు. ఈ ఘటనలో పోలీసులు రూ. 50 విలువగలవి 100 నకిలీ నోట్లతో పాటు కంప్యూటర్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మంచిర్యాల కేంద్రంగా దొంగనోట్ల చలామణికూడా జోరుగా సా గుతోంది. జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, మంచిర్యాల, శ్రీరాంపూర్, చెన్నూర్, లక్షెట్టిపేట, దండేపల్లిలో కొందరు యథేశ్ఛగా నకిలీ నోట్లను మార్పిడి చేస్తున్నట్లు సమాచారం. మంచిర్యాలలో త యారైన నకిలీ నోట్లతోపాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి నకిలీ నోట్లను తెచ్చి ఇక్కడ చలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది.
లక్షెట్టిపేట కేంద్రంగా...
తాజాగా లక్షెట్టిపేట పట్టణ కేంద్రంగా దొంగనోట్లను చలామణి చేస్తున్న ముఠాను ఫిబ్రవరి 28న పోలీసు లు పట్టుకోవడం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది నిందితులతో పాటు రూ. 6 లక్షల విలువగల నకిలీ కరెన్సీ నోట్లు, మూడు కార్లు, 11 సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ కేంద్రంగా ముద్రించిన న కిలీ కరెన్సీని అక్కడి వ్యక్తులు పలువురు ఇక్కడి తమ ఏజెంట్ల ద్వారా చలామణికి యత్నించి, అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. అలాగే లక్షెట్టిపేట మండలంలో ని ఇటిక్యాల (ప్రస్తుతం మునిసిపల్ పరిధి)లోనూ నకి లీ కరెన్సీ దందా గతంలో పలుమార్లు వెలుగులోకి వచ్చింది. స్థానికులు కొందరు ఇతర రాష్ట్రాలలోని ఏజెం ట్ల ద్వారా నకిలీ కరెన్సీ తెప్పించుకొని జిల్లాలో చలా మణి చేస్తుండగా, పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల బ్యాంకుల్లోనూ నకిలీ కరెన్సీ నోట్లు తరుచుగా రావడమే దీనికి నిదర్శనం. నకిలీనోట్లు వచ్చిన సందర్భాల్లో బ్యాం కు అధికారులు వాటిపై రెడ్ ఇంక్‌తో మార్క్ చేయడం ద్వారా తిరిగి చలామణిలో ఉండకుండా నిరోధించేవా రు. పెద్ద మొత్తంలో నోట్లు వచ్చిన సందర్భంలో పోలీ సులకు సమాచారం ఇస్తుండటంతో లోతుగా ధృష్టిసా రించడం ద్వారా వాటి కారకులను అరెస్టు చేస్తున్నారు. ఓ వైపు పోలీసులు ఎప్పటికప్పుడు నకిలీ దందాను అ రికట్టేందుకు చర్యలు చేపడుతున్నప్పటికీ పోలీసుల క ళ్లుగప్పి అదును చూసి అక్రమ దందాను కొనసాగి స్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా నకిలీ కరెన్సీ చ లామణి వల్ల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. మొన్నటి మునిసిపల్ ఎన్నికల సం దర్భంగా పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ చలామణిలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.