Share News

kumaram bheem asifabad- మరో మూడు రోజులు పత్తి కొనుగోళ్లు

ABN , Publish Date - Feb 23 , 2026 | 10:34 PM

సంక్షోభంలో ఉన్న పత్తి రైతులకు ఎట్టకేలకు సీసీఐ ఊరట కలిగించింది. పత్తి కొనుగోళ్లను ఈ నెల 27 వరకు చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పత్తిలో నాణ్యతలేదనే సాకుతో రాష్ట్రవ్యా ప్తంగా ఈనెల 20 వరకే కొనుగోళ్లు జరిపి ఆ తర్వాత మార్కెట్‌లో కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటిం చింది.

kumaram bheem asifabad- మరో మూడు రోజులు పత్తి కొనుగోళ్లు
రైతు సాగు చేస్తున్న పత్తి

- జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో సాగు

వాంకిడి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): సంక్షోభంలో ఉన్న పత్తి రైతులకు ఎట్టకేలకు సీసీఐ ఊరట కలిగించింది. పత్తి కొనుగోళ్లను ఈ నెల 27 వరకు చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పత్తిలో నాణ్యతలేదనే సాకుతో రాష్ట్రవ్యా ప్తంగా ఈనెల 20 వరకే కొనుగోళ్లు జరిపి ఆ తర్వాత మార్కెట్‌లో కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటిం చింది. దీంతో పత్తి రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. చేతికి అందిన కొద్దిపాటి పత్తి కూడా ప్రైవేటు దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేయ డంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళ నకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా పలు మండ లాల్లో పత్తి కొనుగోళ్లు పొడిగించాలని ఆందోళనబాట పట్టారు. రాష్ట్ర మంత్రులు, బీజేపి ఎమ్మెల్యేలు పత్తి రైతుల సమస్యలను కేంద్రానికి విన్నవించడంతో సీసీఐ ఈ మేరకు వారం రోజుల పాటు కొనుగోళ్లకు అంగీకారం తెలిపింది.

- అన్నదాతలకు ఇబ్బందులు..

పత్తి సాగు చేస్తున్న అన్నదాతలు ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. పత్తి ఏరివేతకు అవసరమైన కూలీలు దొరకకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో చేన్లలోనే దూదిపూలు మిగిలిపోయి రాలిపోతున్నాయి. కూలీల కొరత కారణంగా పంటను సకాలంలో ఏరలేక రైతులు ఆందోళన చెందు తున్నారు. ప్రత్యేకంగా జాతరలు ప్రారంభం కావండంతో వలస కూలీలు అందుబాటులో లేకపోవడం, ఉపాధి హామీ పనులు కొనసాగుతుండడం, వంటి కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. రోజుకు కూలీ ధర కిలోకు 15 నుంచి 20 పెరిగినా పనికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోవడంతో పంట నష్టపోయే పరిస్థితి నెలకొంది. పత్తి పూలు పూర్తిగా ఏరుకోకపోతే దిగుబ డి తగ్గడంతో పాటు నాణ్యతపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతుండడంతో రైతులు ఏం చేయాలో దిక్కుతో చని పరిస్థితిలో ఉన్నారు. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతినగా ఉన్న కాస్త పత్తి పంట ఏరివేతకు కూలీలు దొరకక చేసి న అప్పులు తీర్చలేక ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

- తగ్గిన దిగుబడి..

ఈ వానాకాలంలో పత్తి దిగుబడి తగ్గడంతో రైతు లు తీవ్ర నిరాశ చెందారు. మొలక దశ నుంచి అతి వృష్టి కలుపుతీత, పంట పెట్టుబడి ధరలు అమాం తం పెరుగడంతో రైతులు పంట చేతికివచ్చే వరకు నష్టాలు చవిచూశారు. సీసీఐ మద్దతు ధర రూ. 8,320 ప్రకటించినప్పటికీ 8 నుంచి 12 శాతం పత్తిలో తేమ ఉంటేనే కొనుగోళ్లు చేశారు. ప్రైవేటు రంగంలో క్వింటాలుకు రూ. 1000 నుంచి 1500ల కొతలు విధించి కొనుగోళ్లు చేపట్టడంతో రైతులు తీవ్ర నష్టాలకు గురికావాల్సి వచ్చింది. ఏకరాకు 9 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు కేవలం ఐదు నుంచి ఆరు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో సాగు చేయగా గత ఏడాది కంటే ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గిపోయింది. తీరా పత్తి కొనుగోళ్ల గడువును ప్రభుత్వం కుదించి నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో పత్తి రైతులు దిక్కు తోచని పరిస్థితి ని ఎదుర్కొవాల్సి వచ్చింది. సీసీఐ కొనుగోళ్ల గడువు పొడిగించడంతో రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. కా గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2025లో పత్తి దిగు బడి పెరిగింది. కానీ ఈ సారి దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారు. గత ఏడాది పత్తి మార్కెట్‌ సీజన్‌లో 56,94,617 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. ఈ ఏడాది కేవలం 40,25,043 క్వింటాళ్లు మాత్రమే పత్తి కొను గోళ్లు జరిగాయి. కుమరం భీం జిల్లాలో గత ఏడాది 16.88 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు చేప ్టారు. కానీ ఈ ఏడాది 12.91 లక్షల క్వింటాళ్ల కొనుగో ళ్లు మాత్రమే జరిగాయి. సీసీఐ గడువు పొడిగించి నందున కొనుగోళ్లల్లో అధికారులు కొర్రీలు పెట్టకుం డా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 10:34 PM