kumaram bheem asifabad- కళ్లెదుట పత్తి పంట.. కూలీలు లేక చింత
ABN , Publish Date - Nov 26 , 2026 | 10:41 PM
వేసిన పంటలో పత్తిని తీసేందుకు కూలీల కొరత ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి రైతాంగాన్ని కష్టాలు చుట్టు ముట్టాయి. తెల్లబంగారం సాగు చేసిన రైతులకు ఈసారి కూలీల కొరత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పత్తి పంట చేతికొచ్చిన వేళ ఏరేందుకు కూలీలు దొరక్కపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- కూలి పెంచినా దొరకక అవస్థలు
- జిల్లాలో 3.70 లక్షల ఎకరాల్లో సాగు
- వర్ష భయంతో రైతు గుండెల్లో దడ
ఆసిఫాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): వేసిన పంటలో పత్తిని తీసేందుకు కూలీల కొరత ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి రైతాంగాన్ని కష్టాలు చుట్టు ముట్టాయి. తెల్లబంగారం సాగు చేసిన రైతులకు ఈసారి కూలీల కొరత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పత్తి పంట చేతికొచ్చిన వేళ ఏరేందుకు కూలీలు దొరక్కపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్ప టికే విత ్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగు ఖర్చు లతో ఆర్థికంగా సతమతమైన రైతులకు ఇప్పుడు కూలీల సమస్య కొత్త భారంగా మారింది. పంట ఏరేందుకు కూలీల కోసం గ్రామాలు, పట్టణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు పంట పూర్తిగా ఏరేందుకు ఆలస్యమవుతుండగా.. మరో వైపు వాతావరణ పరిస్థితులపై రైతుల్లో ఆందోలన నెలకొన్నది.
- ఈ ఏడాది సైతం..
ప్రతి సారిలాగే ఈ ఏడాది రైతులకు అవస్థలు తప్పడం లేదు. వానాకాలం ప్రారంభంలో అడపా దడపా వర్షాలు కురవడంతో పత్తి ఏపుగా పెరిగిం ది. తర్వాత మళ్లీ సరైన సమయంలో కురవకపోవ డంతో.. అనేక రకాల తెగుళ్లు సోకాయి. దీంతో ఎక్కువసార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి రావడటంతో.. అన్నదాతలకు పెట్టుబడి రెండిం తలైంది. ప్రస్తుతం పత్తి తీసేందుకు సిద్ధంగా ఉన్నా కూలీలు దొరకపోవడం, మంచు కురుస్తుండటంతో అన్నదాతల్లో మరింత ఆందోళన నెలకొంది.. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో దాదాపుగా 3.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగవు తోంది. ఈసారి వాతావరణం ప్రతికూలత ఉన్నా... గత ఏడాదితో పోలిస్తే పంట సాగు పెరిగింది. కూలీ రేట్లు గతేడాది కంటే పెరగడంతో.. అదనపు భారం పడుతోంది.ఒక్కో ఎకరానికి దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక దిగుబడి సైతం తగ్గిపోయిందని ఆందోళన చెందుతున్నారు.కొన్ని చేన్లలో ఎకరానికి కనీసం మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి సైతం రావడం కష్టమేనని రైతులు వాపోతున్నారు.ఎన్నో ఆశలతో సాగు చేసిన పత్తికి కనీస పెట్టుబడులు వచ్చే అవకాశం లేనందున.. పత్తికి పైవ్రేటులోనైనా గిట్టుబాటు ధర ఉండాలని రైతులు కోరుతున్నారు.
- జిల్లాలో ప్రధానంగా..
జిల్లాలో పత్తి ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతోంది. జిల్లాలోని పలు మండలాల్లో రైతులు విస్తారంగా పత్తి సాగు చేశారు. ప్రస్తుతం జిల్లాలో పత్తి సేకరణ ఊపందుకుంది.ఓ వైపు వరి కోతలు,మరోవైపు పత్తి ఏరే సమయం కావడంతో కూలీల కొరత వెంటాడుతోంది.పది రోజులుగా జిల్లాలో పత్తి తీసే పనులు ముమ్మరమయ్యాయి. రైతు కుటుంబీకులతో పాటు స్థానిక కూలీలతో పత్తి ఏరుతున్న సరిపోని పరిస్థితి. దీంతో కూలీలు దొరకక పొరుగు రాష్ట్రాల వారిపై ఆధారపడక తప్పడం లేదు. మహా రాష్ట్ర, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాల నుంచి ఈ ఏడాది కూలీలను వచ్చి పత్తి తీస్తున్నారు. స్థానికంగా గుడిసెలు వేసుకొని కూలీ ల కుటుంబాలు నివాసముంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు పత్తిని తీస్తున్నారు. రైతులు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా కూలీలకు అవసరమైన వసతులు కల్పించే బాధ్యత సైతం తీసుకుంటున్నారు. కూలీ లను తరలించేందుకు వాహనం కిరాయి సైతం భరిస్తున్నారు. పత్తి ఏరడం, ట్రాక్టర్లో ఎక్కించడం, ఇంటి వద్ద నిల్వ చేయడం తదితర పనులను చేపడుతున్నారు.
- కొరతను ఆసరాగా చేసుకుని..
కూలీల కొరతను ఆసరాగా చేసుకుని పత్తి ఏరే రేట్లు పెరుగుతున్నాయని రైతులు చెబు తున్నారు. గతంలో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పనులకు ప్రస్తుతం అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలు దొరికినా వారు అడిగిన మొత్తాన్ని ఇచ్చి పనులు చేయిం చుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ఎకరాల కొద్దీ పత్తి సాగు చేసిన రైతులకు కూలీల ఖర్చు భారంగా పరిణమిస్తోంది. పత్తి ఏరిన తర్వాత రవా ణా, ఇతర ఖర్చులు కూడా కలిపితే చేతికి వచ్చే ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నా రు. ప్రస్తుతం కిలో పత్తి ఏరితే రూ.11నుంచి12 కూలీ చెల్లిస్తున్నారు. గతంలో కిలోకు రూ.9 నుంచి 10 చెత్లించేవారు. కొన్ని ప్రాంతాల్లో కూలీలు దొరక కపోతే రూ.13 కూడా ఇస్తున్నారు.