Share News

కార్పొరేషన్‌కు అవినీతి మరక

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:30 PM

మంచిర్యా ల మున్సిపల్‌ కార్పొరేషన్‌ను అవినీతి మరకలు వీడడం లేదు. ప్రతీ పనిలో కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్ర దర్శించడంతో అవమానాలు తప్పడం లేదు.

కార్పొరేషన్‌కు అవినీతి మరక

- నాడు ప్లింత్‌ ఏరియా సర్టిఫికెట్లు

- నేడు చేయూత పెన్షన్లలో అక్రమాలు

- అరెస్ట్‌ అయినా తీరుమారని అధికారులు

- పర్యవేక్షణలోపమే ప్రధాన కారణం

మంచిర్యాల, నవంబర్‌ 20(ఆంఽధ్రప్రభ) : మంచిర్యా ల మున్సిపల్‌ కార్పొరేషన్‌ను అవినీతి మరకలు వీడడం లేదు. ప్రతీ పనిలో కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్ర దర్శించడంతో అవమానాలు తప్పడం లేదు. కింది స్థాయి సిబ్బంది ముఠాగా ఏర్పడి అవినీతిని ప్రోత్సహి స్తుండ డంతో అధికారులకు తలవంపులు తప్పడం లేదు. బర్త్‌ సర్టిఫికేట్‌ మొదలుకొని ప్రతీ పనిలో ఆమ్యామ్యాలు ఆ శించడంతో సర్వత్రా చెడ్డ పేరు మూటగట్టుకుంటోంది. గతంలో గ్రేడ్‌ 1 మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాల రెండే ళ్ల క్రితం కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. నగరం అభివృద్ధి చెందడంతో పాటు అవినీతి కూడా విజృంభి స్తోంది. కింది స్థాయి సిబ్బంది చేతి వాటం కారణంగా పై అధికారులకు సైతం మరక అంటుతుండగా ప్రజల నోళ్లల్లో నిత్యం నానుతోంది. ప్రతీ పనికి ఓ రేటు ఫిక్స్‌ చే సి అక్రమంగా వసూలు చేస్తుండడంతో ప్రజలు సైతం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై కలె క్టర్‌కు సైతం ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ పరిస్థి తిలో మార్పులు రాకపోవడం ప్రజలకు శాపంగా మారింది.

సర్టిఫికెట్ల జారీలో అవినీతి...

కార్పొరేషన్‌ పరిధిలో వివిధ పనులకు సంబంధింఽచి జారీ అయిన సర్టిఫికెట్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిన ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్లింత్‌ చర్య సర్టిఫికెట్ల జారీలో పెద్ద మొత్తంలో అవినీతి జరగగా ధ నార్జనే ద్యేయంగా సిబ్బంది ఇష్టారీతినా దృవీకరణ పత్రా లు జారీ చేసిన ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. ఇంటి స్థలాల రిజిస్ర్టేషన్‌కు సంబంధించి ప్లింత్‌ ఏరియా సర్టిఫి కెట్‌ తప్పనిసరి కావడంతో ఆ దిశగా భారీ కుంభకోణం వెలుగుచూసింది. క్రమబద్ధీకరణ కోసం సబ్‌ రిజిస్ట్రర్‌ కా ర్యాలయంంలో ప్రజలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం ది. దీనిని ఆసరాగా చేసుకున్న కార్పొరేషన్‌ కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వెల్లివె త్తుతున్నాయి. వాస్తవంగా ఇంటి స్థలాల క్రమబద్దీకరణ కోసం మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి ఎలాంటి ప్లింత్‌ ఏరి యా సర్టిఫికెట్‌ అవసరం లేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేవలం మంచిర్యాల, పెద్దపెల్లి జి ల్లాలలో మాత్రమే ప్లింత్‌ ఏరియా సర్టిఫికెట్‌ అడుగు తుండడం గమనార్హం. దీనిని ఆసరాగా చేసుకున్న కింది స్థాయి సిబ్బంది ప్రజల అవసరాన్ని తమకు అనుకూలం గా మార్చుకుని పెద్ద మొత్తంలో దోపిడికి తెరలేపారు. ఈ క్రమంలో కార్పొరేషన్‌కు చెందిన ఇర్ఫాన్‌, శివకుమార్‌ అనే ఉద్యోగులు సర్టిఫికెట్‌ జారీలో తమ చేతివాటం ప్రద ర్శించగా విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికా రుల ఫిర్యాదు మేరకు కటకటాలపాలయ్యారు. ఇలా ప్రతీ పనికి సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం కార్పొరేషన్‌ ప రిధిలో ఆనవాయితీగా వస్తోంది.

చేయూతపెన్షన్లలోనూ అవినీతి....

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చే యూత పెన్షన్ల కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ఆ హ్వానించింది. గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించగా వేల సంఖ్యలో పింఛన్ల కోసం ప్రజలు దర ఖాస్తు చేసుకున్నారు. ఇందులో చేయూత పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని అర్హులకు లబ్ది చేకూర్చాలనే దృఢనిశ్చయంతో ఉంది. దీనిని ఆసరా గా తీసుకున్న కొందరు సిబ్బంది అవినీతికి తెర లేపారు. ఈ క్రమంలో కార్పొరేషన్‌ పరిధిలోని 17వ డివిజన్‌ గుడి పేటకు చెందిన సిద్ద లక్ష్మి అనే గృహిణికి సంబంధించి వి తంతు పెన్షన్‌ జారీ విషయంలో అవినీతి ఆరోపణలు నె లకొనగా డివిజన్‌ ఆఫీసర్‌కు మెమో జారీ అయింది. అ న్ని అర్హతలున్నా లక్ష్మిని కాదని పెన్షన్‌కు ఎంపిక చేయ కపోవడంతో విషయం బహిర్గతమైంది. ఈ విషయమై జోరుగా ప్రచారం జరగడంతో విచారణ జరిపిన ఉన్నతా ధికారులు డివిజన్‌ ఆఫీసర్‌పై వేటు వేశారు. ఇలా అర్హు లను కాదని అనర్హులను అందలం ఎక్కించడంలో డివి జన్‌ అధికారులు ప్రముఖ పాత్ర పోషించినట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి.

పర్యవేక్షణ లోపంతోనే అవినీతి....

కాగా కార్పొరేషన్‌ పరిధిలో జరుగుతున్న అవినీతి అక్ర మాలకు పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణంగా తెలు స్తోంది. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవే క్షించాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల అది కార్యరూ పం దాల్చకపోవడంతో అవినీతి జరుగుతున్నట్లు తెలు స్తోంది. గతంలో సైతం కార్పొరేషన్‌ పరిధిలో పెద్ద మొ త్తంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్న దాఖలా లు అనేకం ఉన్నాయి. గతంలో బిల్‌ కలెక్టర్లకు ఇంటి ప న్ను సంబంధించి రశీదు పుస్తకాలు అప్పగించగా పెద్ద మొత్తంలో వారు ప్రజాదనం దుర్వినియోగం చేయగా అ ధికారులు తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. బిల్‌ క లెక్టర్లకు రశీదు పుస్తకాలు అందజేసిన అధికారులు అనం తరం తగిన రీతిలో పర్యవేక్షణ చేయకపోవడంతో లక్షలా ది రూపాయలు చేతులు మారాయి. ఇదిలా ఉండగా తా జాగా జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసిన బూక్య లీల అనే మహిళకు సంబంధించిన విషయంలోనూ అధికారుల అవినీతి బాగోతం వెలుగుచూసింది. ఈ విషయమై స దరు మహిళా ప్రజావాణి కార్యక్రమంలో బహిరం గంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. అనుమతి విషయంలో కమిషనర్‌ పేరు చెప్పి సిబ్బంది ఒకరు లక్ష రూ పాయ లు డిమాండ్‌ చేయగా ఆన్‌లైన్‌ రూపంలో నగదు పం పినట్లు ఫిర్యాదులో పేర్కొనడం కొసమెరుపు. ఈ విష యంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కలెక్టర్‌ కు మార్‌ దీపక్‌ పోలీసు శాఖను ఆదేశించడం సంచలనం రేకెత్తించింది. పోలీసుల విచారణలో అవినీతి జరిగినట్లు నిరూపన అయిన పక్షంలో సిబ్బంది తగిన మూల్యం చె ల్లించే పరిస్ధితులు నెలకొన్నాయి. ఇలా ప్రతీ పనిలోనూ చేతివాటం ప్రదర్శించడం కార్పొరేషన్‌ పరిధిలో ఆనవా యితీగా వస్తుండగా సంబంధిత అధికారులు తగిన చర్య లు తీసుకోవడం ద్వారా అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Updated Date - Nov 20 , 2026 | 11:30 PM