సింగరేణిలో పెరిగిన అవినీతి.. తగ్గిన ఉత్పత్తి
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:22 AM
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సింగరేణిలో అవినీతి పెరిగిపోయి, ఉత్పత్తి తగ్గిపోయిందని, ఇందుకు కార్మికులు బాధ్యులు కారని, కాంగ్రేస్సే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం స్థానిక జవహర్లాల్ స్టేడి యంలో జరిగిన సింగరేణి
గోదావరిఖని, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సింగరేణిలో అవినీతి పెరిగిపోయి, ఉత్పత్తి తగ్గిపోయిందని, ఇందుకు కార్మికులు బాధ్యులు కారని, కాంగ్రేస్సే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం స్థానిక జవహర్లాల్ స్టేడి యంలో జరిగిన సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సింగరే ణి 70మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ సర్కారులో 58మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి మాత్రమే ఎందుకు జరిగిందని ఆయన ప్రశ్నించారు. సైట్ విజిట్ల పేర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి అవినీతికర చర్యలతో ఓబీ టెండర్లు ఆలస్యమై సింగరేణి ఉత్పత్తికి విఘాతం కలిగిందని కేటీఆర్ అన్నారు. సిరుల సింగరేణిని అవినీతి గనిగా మార్చారని, కోల్మాల్ దొంగలు పెరిగిపోయారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు, నీళ్లు, బొగ్గుకు కొరత లేదని, ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో కార్మిక లోకం ఆలోచించా లన్నారు. 40లక్షల టన్నుల బొగ్గును మాయం చేసిన ఈ దొంగలు గత మూడేళ్లుగా రూ.6,311కోట్లు సింగ రేణి భవిష్యత్ కోసం పక్కన పెట్టామని, ఆ మొత్తాన్ని మాయం చేశారని కేటీఆర్ ఆరోపించారు. సింగరే ణిలో బొగ్గు ఉత్పత్తి జరుగడం లేదని, అందుకే విద్యు త్ కొరత ఏర్పడుతుందని సింగరేణి సంస్థను అబాసు పాలు చేసి అమ్మకానికి పెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. సింగరేణిని కాంగ్రెస్ చంపే ప్రయత్నం చేస్తున్నదన్నారు. వేల కోట్ల డిపాజిట్లతో ఉన్న సింగరేణి ఇప్పుడు ఓడీలు తెచ్చుకుని దివాళా తీసే స్థాయికి దిగజారిందన్నారు. మూసీ నదికి రూ.1.5లక్షల కోట్లు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి సింగరేణికి బకాయి పడిన రూ.60వేల కోట్లను ఎందు కు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించారు. నైనీ టెండర్లలో, ఇతర ఓబీ టెండర్లలో అవినీతి జరిగిందని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్య లేదని, కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మిలాఖత్ అయ్యే సింగరేణిలో అవినీతిని కొనసాగిస్తు న్నారని, సింగరేణిలో యాజమాన్యం పని చేయడం లేదని, సృజన్రెడ్డే సింగరేణిని నడుపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభు త్వం ఓబీ, సోలార్, పవర్, జిలెటిన్ స్టిక్స్ లాంటి అనే క టెండర్లలో కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల వాటా 16శాతం నుంచి 32శా తంకు పెంచామని, కాంగ్రెస్ మూడేళ్లలో 2శాతం మాత్రమే పెంచిందన్నారు. సింగరేణి కార్మికులకు, సింగరేణికి ఏ నష్టం జరిగినా బీఆర్ఎస్ ఊరుకోదని, అవసరమైతే కోల్‌బెల్ట్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యే ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రతి నెల మూడు సార్లు మెడికల్ బోర్డులు నిర్వహించి డిపెం డెంట్ ఉద్యోగాలను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పినట్టే సింగరేణిలో ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండాను ఎగురవేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడడం కేవలం కేసీఆర్ నాయక త్వంలో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ఫర్ సేల్కు పెట్టిందని, ట్రాన్స్‌కోలో 26శాతం వాటాను ప్రైవేట్‌పరం చేస్తున్న దని, తరువాత సింగరేణి వంతేనని చెప్పారు. సింగరేణి చరిత్ర నిండా కార్మికుల తాగ్యాలు, బలిదానాలు ఉన్నాయని, వాళ్ల చెమట, నెత్తురుతోనే దేశానికి వెలుగులు అందుతున్నాయన్నారు. సింగరేణి కార్మికులు బొగ్గును మాత్రమే కాకుండా ఉద్యమా లను కూడా ఉత్పత్తి చేశారన్నారు. సకల జనుల సమ్మె దేశాన్ని గడగడ లాడించిందని, కేసీఆర్‌కు మీరు తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచిన విష యాన్ని ఎప్పుడూ మరిచిపోమని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్కు అధికారం మాత్రమే కాదని, తెలంగాణ పట్ల, సింగరేణి పట్ల బాధ్యత కూడా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రెప్పపాటు కరెంటు పోలేదని, ప్రభుత్వాన్ని నడపడం అంటే డైలాగులు కొట్టడం కాదని ఆయన చెప్పారు. రైతులకు నీరు లేక బహి రంగంగానే కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయిందని ఎద్దేవా చేశారు. గోదావరిఖని వచ్చినందుకే గడ్డం పెంచానని కేటీఆర్ చమత్కరించారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యా ల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, దివాకర్‌రావు, చిన్నయ్య, గండ్ర రమణారెడ్డి, టీ జీవన్‌రెడ్డి, మధు సూధనచారి, పుట్ట మధు, నాయకులు కోలేటి దామో దర్, కౌశిక హరి, హరీష్‌రెడ్డి, ఉష పాల్గొన్నారు.
ఫ కేటీఆర్ ‘న్యూ లుక్’
గోదావరిఖని సింహగర్జన బహిరంగ సభకు కేటీఆర్ న్యూలుక్‌తో హాజరయ్యారు. కేటీఆర్ గడ్డంతో కనిపించడంతో బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకున్నారు. మొదటిసారి కేటీఆర్ గడ్డంతో కనిపించడం ప్రత్యేకం గా అనిపించిందనే చర్చ నాయకులు, కార్యకర్తల్లో కనిపించింది.