Share News

కాంగ్రెస్‌తోనే కార్పొరేషన్‌ అభివృద్ధి

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:56 PM

కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్‌ అభి వృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ఏఐసీసీ కార్యదర్శి స చిన్‌ సావంత్‌ అన్నారు.

కాంగ్రెస్‌తోనే కార్పొరేషన్‌ అభివృద్ధి

ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌

నస్పూర్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్‌ అభి వృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ఏఐసీసీ కార్యదర్శి స చిన్‌ సావంత్‌ అన్నారు. నస్పూర్‌ పరిధిలో గల కార్పొరేషన్‌ అన్ని డివిజన్లలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరుపున గురువారం సాయంత్రం న్యూ నాగార్జున కాలనీ లోని ప్రాణహిత స్టేడియంలో ప్రచార సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మం చి ర్యాల అభివృద్దికి ఇక్కడి ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు నిరంతరం కృషి చేస్తు న్నారన్నారు. ఇక్కడి ప్రజలపై ఉన్న ప్రేమతో అధిక నిధులు తెప్పించి అభి వృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. కార్పొరేషన్‌లో అన్ని డివిజన్ల అభ్యర్థులను గెలిపిస్తే హైదరాబాద్‌ లాంటి నగరంగా మార్చుతారన్నారు. ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌ రావు మాట్లాడుతూ ప్రజలు అవకాశం ఇచ్చారని, అవసర మై అభివృద్ది పనులు చేస్తున్ననన్నారు. కార్పొరేషన్‌ అభివృద్ధి చెందాలంటే అన్ని డివిజన్ల కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశం లో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నస్పూర్‌లోని అన్ని డివి జన్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:56 PM