కార్పొరేషన్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం..
ABN , Publish Date - Jan 20 , 2026 | 11:18 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, బీజేపీ ద్వారానే కార్పొరే ష న్ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వె రబెల్లి అన్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి
నస్పూర్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, బీజేపీ ద్వారానే కార్పొరే ష న్ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వె రబెల్లి అన్నారు. నస్పూర్ పట్టణం ఊరు శ్రీరాంపూర్ కార్పొరేషన్ 31వ డి విజన్‌లో నాయకుడు తిప్పని భీమయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పా టు చేసిన సమావేశంలో పలువురు బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రఘునాథ్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్పొరే షన్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అ భ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు గా జుల ముఖేష్ గౌడ్, సత్రం రమేష్, పొన్నవేని సదయ్య, ఈర్ల సదానందం, బద్రి శ్రీకాంత్, కిశోర్, కటుకూరి తిరుపతి, మహేష్ పాల్గొన్నారు.