Share News

అచ్చంపేట ఆసుపత్రిలో కార్పొరేట్‌ వైద్యం

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:14 PM

అచ్చంపేట ఆసుపత్రి లో రోగులకు కార్పొరేట్‌ వైద్యం అందిం చే విధంగా కృషి చేస్తున్నామని ఎమ్మె ల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

అచ్చంపేట ఆసుపత్రిలో కార్పొరేట్‌ వైద్యం
ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : అచ్చంపేట ఆసుపత్రి లో రోగులకు కార్పొరేట్‌ వైద్యం అందిం చే విధంగా కృషి చేస్తున్నామని ఎమ్మె ల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. నేడు అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో ని ర్వహించనున్న నాలుగో విడత మెగా సర్జికల్‌ క్యాంప్‌కు సంబంధించిన ఏ ర్పాట్లను ఆయన బుధవారం పరిశీలిం చారు. క్యాంప్‌కు వచ్చే రోగులకు ఎలాం టి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పా ట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ మెగా సర్జి కల్‌ క్యాంప్‌ ద్వారా నియోజకవర్గ ప్రజలకు నా ణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మెగా సర్జికల్‌ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ శ్రీనివాసులు, డీసీహెచ్‌సీ డాక్టర్‌ రామ కృష్ణ, డాక్టర్లు మహేష్‌, ప్రతిప్‌రాజ్‌, నర్సింగ్‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 11:14 PM