మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:28 PM
యాసంగి సీజన్‌లో రైతులు పం డించిన మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా ల్లోనే విక్రయించి మద్దతు ధరను పొం దాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్ర తినిధులు రైతులకు సూచించారు.
పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యో తి) : యాసంగి సీజన్‌లో రైతులు పం డించిన మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా ల్లోనే విక్రయించి మద్దతు ధరను పొం దాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్ర తినిధులు రైతులకు సూచించారు. గు రువారం పెద్దకొత్తపల్లిలో సింగిల్ విం డో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రా రంభించారు. మొక్కజొన్న పంట క్వింటా ల్‌కు మద్దతు ధర రూ.2400లు ప్రభు త్వం ప్రకటించిందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపీపీలు సూర్యప్రతాప్‌గౌడ్, వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎంపీటీసీ దండు నర సింహ, సింగిల్‌విండో మాజీ చైర్మన్లు శ్రీనివాస్ యాదవ్, గోపాల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగపూర్ విష్ణు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వన్నోజు సత్యం, సర్పంచ్ మెట్ట కుర్మయ్య పాల్గొన్నారు.
ఫ కోడేరు, (ఆంధ్రజ్యోతి) : మండల పరిధి లోని జనుంపల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మండల స్పెషల్ ఆఫీసర్ గోవర్ధన్‌గౌడ్‌తో కలిసి సర్పంచు మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. మద్దతు ధరకు విక్రయించి లా భాలు పొందాలని ఆయన అన్నారు. సింగిల్ విండో సీఈవో ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్‌రావు, ఏఈవో నవ్యభారతి, గ్రామ పెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు.