Share News

కాపర్‌ కేటుగాళ్లు....

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:36 PM

జిల్లాలో కొంతకాలంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు రెచ్చి పో తున్నారు. పొలాల్లోని రైతుల వ్యవసాయ మోటార్లకు సం బంధించిన ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్‌వైర్లను ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు పంటకాలంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుండడంతో పంట నష్టం వాటిల్లుతోం ది.

కాపర్‌ కేటుగాళ్లు....

వ్యవసాయ క్షేత్రాల్లోని ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం

కాపర్‌వైరు చోరీ చేస్తున్న దొంగలు

జిల్లాలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు

ఇబ్బందులు పడుతున్న రైతులు

====================

బెల్లంపల్లి,సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొంతకాలంగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు రెచ్చి పో తున్నారు. పొలాల్లోని రైతుల వ్యవసాయ మోటార్లకు సం బంధించిన ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్‌వైర్లను ఎత్తుకెళ్తున్నారు. దీంతో రైతులు పంటకాలంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుండడంతో పంట నష్టం వాటిల్లుతోం ది. మరోవైపు విద్యుత్‌శాఖకు పెద్ద ఎత్తున నష్టం చేకూ రుతుంది. ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాపర్‌వైర్ల దొంగతనాలు వరుసగా చోటు చేసు కుంటుండడంతో రై తులకు కంటినిండ కునుకులేకుండా పోతోంది.

పంటపొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లే టార్గెట్‌...

కాపర్‌వైర్‌ దొంగలు ముఠాగా ఏర్పడి వ్యవసాయ క్షేత్రా ల్లోని ట్రాన్స్‌ఫార్మర్లనే టార్గెట్‌ చేస్తున్నారు. ట్రాన్స్‌ ఫార్మ ర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్‌(రాగి) తీగలను దొంగిలిస్తున్నారు. గ్రామాలకు ఇంటి నివాసాలకు పంట పొలాలు ధృఢంగా ఉంటుండడంతో దొంగల ముఠాలకు కాపర్‌ దొంగతనం సులభతరంగా మారుతోంది. ఎక్కువ శాతం ఊరికి దూరంగా ఉన్న పొలాలను టార్గెట్‌ చేసి కా పర్‌వైర్‌ దొంగతనానికి పాల్పడుతున్నారు. పొలాల్లో రాత్రి సమయంలో రైతులు, ఎవరు ఉండక పోవడంతో దొంగ లకు చోరీ సులువుగా మారుతోంది. జిల్లాలో నిత్యం ఎక్క డో ఒక చోట కాపర్‌వైర్‌ను దొంగలిస్తున్నారు. సాధారణం గా కాపర్‌ విలువ కిలోకి బయట మార్కెట్‌లో రూ.1500 నుంచి రూ.2వేల వరకు ఉంటుంది. దొంగలు చోరీ చేసి న కాపర్‌వైరును కేవలం 400 నుంచి 500 రూపాయలకే విక్రయిస్తున్నారు. చిన్న ట్రాన్స్‌ఫార్మర్లలో 8 నుంచి 10 కి లోల రాగితీగ ఉంటే పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లలో 15 నుంచి 20 కిలోల వరకు రాగితీగలు ఉంటాయి. ఇళ్లలో దొంగతనం రిస్కుతోకూడుకున్న పనికావడంతో వ్యవ సాయక్షేత్రాల వద్ద సులువుగా ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌ వైర్లు దొంగలిస్తున్నారు.

నష్టపోతున్న రైతులు...

పంటపొలాల వద్ద ట్రాన్స్‌ఫార్మర్లను ధొంగలు ద్వంసం చేసి కాపర్‌వైరును ఎత్తుకెళ్తుతుండడంతో విద్యుత్‌ సరఫ రా నిలిచిపోతోంది. మళ్లీ రైతులు విద్యుత్‌ సరఫరా కోసం పోలీసు కేసు నమోదు అయ్యాకే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏ ర్పాటుకు అనుమతి లభిస్తోంది. దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్‌ కు బదులుగా కొత్తది అమర్చే వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఈ సమయంలో పంటలకు నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేగా కుండా ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్‌వైరు దొంగలు ఎత్తుకెళ్లి నతరువాత రైతులు పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదిక్షణలతో పాటు పైరవీరులు చేస్తే తప్ప ఎఫ్‌ఐర్‌ నమోదు చేయ డం లేదు. మరొక ట్రాన్స్‌ఫార్మర్‌ కావాలంటే తప్పనిసరిగా పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ కావాలనే నిబంధన ఉండ డంతో విద్యుత్‌శాఖ అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ప్రతి ఏడాది జిల్లాలో దాదాపు 100 నుంచి 150 వ రకు ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌తీగలను దుండగులు ద దొంగిలిస్తున్నారు. దీంతో విద్యుత్‌శాఖకు తీవ్ర నష్టం వాటి ల్లుతోంది. ట్రాన్స్‌ఫార్మర్లలో దొంగలు దొంగిలించిన ఆయి ల్‌, కాపర్‌ సామగ్రికి అమ్మితే రూ. 5 నుంచి రూ.6వేల వరకు వస్తుంది. కానీ వాటిని మరమ్మతులు చేస్తే సంస్థ కు రైతులకు కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది.

సింగరేణిలో, బీఎస్‌ఎన్‌, విద్యుత్‌శాఖలో ...

కాపర్‌ దొంగలు సింగరేణి గనుల వద్ద ఓసీల వద్ద విద్యుత్‌ వైర్లలోని కాపర్‌ను దొంగలిస్తున్నారు. అంతేగా కుండా సబ్‌స్టేసన్ల వద్ద, ట్రాన్స్‌కో కార్యాలయాల వద్ద సైతం దొంగలు పెద్ద ఎత్తున కాపర్‌వైర్లను దొంగలిస్తూ సంస్థలకు ఆర్థిక నష్టం చేకూరుస్తున్నారు. ఇటీవల సింగ రేణిలో, ఫస్టేషన్‌, ట్రాన్స్‌ కార్యాలయాల వద్ద కాపర్‌వైరు దొంగలించిన ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. రూ. లక్షల విలువైన కాపర్‌వైర్లను ఎత్తుకెళ్లుతుండడంతో విద్యుత్‌శాఖ అధికారులను పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు మచ్చుకు కొన్ని...

ఫతాండూర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో 21 టాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్‌వైర్లు ఎత్తుకెళ్లిన ఘ టన కలకలం రేపింది. ఈ ఘటనలో 12 మంది దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి దాదాపు 50వేల విలువైన కాపర్‌వైరును స్వాధీనం చేసుకున్నారు.

ఫబెల్లంపల్లిలో బీఎస్‌ఎన్‌, ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాపర్‌వైరు దొంగలించిన ఘటనలో పోలీసులు దొంగల ముఠాను పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. వీరిపై గతంలో సైతం కాపర్‌వైరు దొంగిలించిన కేసులు నమోదు అయ్యాయి. వీరందరూ ముఠాగా ఏర్పడి కాపర్‌ వైరు దొంగతనానికి పాల్పడుతున్నారు.

ఫనస్పూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌లోని 170 కిలోల రాగితీగ దొంగతనం జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఓమిని వ్యా న్‌తో పాటు 70 కిలోల రాగితీగ, పల్సర్‌ వాహనం, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

ఫతాండూర్‌ మండలంలోని కాసిపేట గ్రామంలో ఓపె న్‌నగర్‌ రహదారివెంట ఉన్న పంటపొలాల వద్ద పది వ్య వసాయ బోరు మోటార్లతో పాటు కాపర్‌వైరు దొంగలిం చబడింది. ఈ ఘటనలో రైతులు ఆర్థిక నష్టంతో పాటు పంట నష్టం ఎదుర్కొవాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఫబెల్లంపల్లిలోని విద్యుత్‌ ట్రాన్స్‌ కార్యాలయం ఆవర ణలో రూ.లక్ష రూపాయల విలువగల కాపర్‌వైరును రార తికిరాత్రే దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. దీంతో అధికారులు సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యా దు చేసినప్పటికీ కాపర్‌వైరుకు సంబంధించిన దొంగలు పట్టుబడలేదు. ఇలాంటి ఘటనలు జిల్లాలో తరుచు ఎక్క డో ఒక చోటు చేసుకుంటున్నాయి.

.

Updated Date - Sep 26 , 2026 | 11:36 PM