Share News

డిజిటలైజేషన్‌ ప్రక్రియకు సహకరించాలి

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:14 PM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ త్వరగా పూర్తయ్యే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ జిల్లాలో 100 శాతం పూర్తి చేయడంలో రాజకీయ పార్టీలు తమ సహకారం అందించాలన్నారు

డిజిటలైజేషన్‌ ప్రక్రియకు సహకరించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ త్వరగా పూర్తయ్యే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ జిల్లాలో 100 శాతం పూర్తి చేయడంలో రాజకీయ పార్టీలు తమ సహకారం అందించాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 76 శాతం పూర్తి చేశామని వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని చెప్పారు. పట్టణప్రాంతాలపై రాజకీయ పార్టీల ప్రతినిదులు ప్రత్యేక దృష్టి సారించాలని బూత్‌ స్థాయి అధికారులకు ఫారాలను అందించే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిందని తెలిపారు. కానీ ఈ ప్రక్రియ ముందే పూర్తి చేసే విధంగా అందరు కృషి చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎన్నికల విభాగం అధికారులు, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 09:09 AM