Share News

ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి

ABN , Publish Date - Aug 11 , 2026 | 10:16 PM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొ న్నారు.

ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొ న్నారు. మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వ హించిన సమావేశంలో ఈఆర్‌వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాల ప్రతిపాదిత మా ర్పులు, కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, పేర్ల మార్పు తదితర వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించామన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 747 పో లింగ్‌ కేంద్రాలకు అదనంగా 18 కొత్త పోలింగ్‌ కేంద్రా లను ఏర్పాటు చేయడం, 22 పోలింగ్‌ కేంద్రాల స్థానా లను మార్చడం,ఒక పోలింగ్‌ కేంద్రం పేరును మార్చడం ప్రతిపాదించగా మొత్తం పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 765కు చేరనుందన్నారు. ఎన్నికల సంఘం స వరించిన ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 17న ప్రచురించబడుతుందన్నారు. అభ్యంతరాలను స్వీకరిం చి అక్టోబరు 19న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పరిధి లోని పోలింగ్‌ కేంద్రాల వివరాలను పరిశీలించి ఏమై నా అభ్యంతరాలుంటే నిర్ణీత గడువులోగా సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 10:16 PM