కో ఆప్షన్ సభ్యుల ప్రమాణం
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:26 PM
కొల్లా పూర్ మునిసిపాలిటీ కో ఆప్షన్ సభ్యులను గురు వారం ఎన్నుకున్నారు.
- ప్రమాణ స్వీకారం చేయించిన మునిసిపల్ కమిషనర్ శంకర్
- పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : కొల్లా పూర్ మునిసిపాలిటీ కో ఆప్షన్ సభ్యులను గురు వారం ఎన్నుకున్నారు. కొల్లాపూర్ మండల పరి షత్ కార్యాలయంలో మునిసిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి అధ్యక్షతన జరిగిన జనరల్‌బాడీ సమావే శంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూ పల్లి కృష్ణారావు సమక్షంలో ఎన్నుకున్నారు.
ప్రమాణ స్వీకారం
నమోదైన నామినేషన్ల పరిశీలన అనంతరం, అభ్యర్థుల జాబితా నుంచి బరిగెల రాముడు, ఎండీ యూసుఫ్, బాబాల పేర్లను తొలగించి మి గతా నలుగురు అర్హులైన అభ్యర్థులను మునిసి పల్ కోఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకు న్నట్లు ప్రకటించారు. నూతన కోఆప్షన్ సభ్యుల తో మునిసిపల్ కమిషనర్ శంకర్ నియమావళి ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించారు.
కో ఆప్షన్ సభ్యులు వీరే..
ప్రత్యేక పరిజ్ఞానం, అను భవం కలిగిన విభాగం నుంచి మహిళల్లో మేకల శి రీష, అనుభవం కలిగిన వి భాగం నుంచి పిన్నంశెట్టి శేఖర్, మైనార్టీ విభా గం (మహిళ) నుంచి నస్రీన్‌బేగం, మైనార్టీ వి భాగం (పురుష) నుంచి మహమ్మద్ అబ్దుల్ నయీమ్, తమపై నమ్మకంతో మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులుగా అవకాశమిచ్చి నందుకు మం త్రి జూపల్లి కృష్ణారావు, మునిసిపల్ చైర్‌పర్సన్ రెడ్డిజ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీం పాషా, కౌన్సి లర్లందరికీ నూతన సభ్యులు కృతజ్ఞతలు తెలిపా రు. పట్టణాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి శాయ శక్తులా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడురెడ్డి సత్యం, ముని సిపల్ అధికారులు, కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
వీబీ జీరాంజీ ఉద్యోగుల వినతి
కొల్లాపూర్, (ఆంధ్రజ్యోతి) : వీబీజీ రాంజీ ఉ ద్యోగుల సుదీర్ఘకాల సమస్య అయిన పేస్కేల్ అమలుపై నాగర్‌కర్నూల్ జిల్లా వీబీజీ రాంజీ జేఏసీ నాయకులు గురువారం కొల్లాపూర్ పట్ట ణంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూ పల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పిం చారు. ఈనెల 14న జరగబోయే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలోని తమ సమస్యలపై చర్చిం చాలని వీబీజీరాంజీ జేఏసీ ప్రతినిధులు మంత్రి ని కోరారు. మంత్రి జూపల్లి సానుకూలంగా స్పందిస్తూ, క్యాబినెట్‌లో సమస్యలను ఖచ్చితంగా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ బాలయ్య, నాయకులు సిద్ధార్థ, టీఏ జిల్లా అధ్యక్షుడు భా స్కర్, సీవోల జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, జేఏసీ ప్రతినిధులు మధు, నాగస్వామి, రవీందర్, స త్యనారాయణ, మల్లికార్జున్, రాజేష్ ఉన్నారు.