Share News

వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలి

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:38 PM

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర లు తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దేశ్యా నాయక్‌ డిమాండ్‌ చేశారు.

వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలి
బల్మూరులో గ్యాస్‌ ధరలను తగ్గించాలని రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

- బల్మూరులో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో

బల్మూరు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర లు తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దేశ్యా నాయక్‌ డిమాండ్‌ చేశారు. పేదలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వ హించారు. వారుమాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సిలిండర్‌ ధర రూ.500 ఉంటే, ఈ 13ఏళ్ల కాలంలో వెయ్యి రూపాయలకు పెరిగిందని అన్నారు. ధరలు త గ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి శంకర్‌ నాయక్‌, మండల నా యకులు ఎండీ లాల్‌ మహమ్మద్‌, గ్రామ కార్య దర్శి బాబర్‌, నాయకులు ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్‌, శేఖర్‌, రాములు, భారీమాం, బాలీశ్వర్‌, కృష్ణ య్య, వసయ్య, శంకర్‌, మాస న, దావీద్‌, వార్డు మెం బరు బాలరాజు, అన్వర్‌, ఆసీఫ్‌ పాల్గొన్నారు.

ఫ పెంట్లవెల్లి (ఆంధ్రజ్యో తి) : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట ట్యాస్‌ సిలిండర్‌ ధరలను ఉప సంహరిం చుకోవాలని కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు హ నుమంతు అన్నారు. ఆదివారం మండల కేం ద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం ముందు వంటగ్యాస్‌ సిలిండర్‌తో నిర సన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలు పెంచడం అన్యాయమని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు కానుకగా ఈ ధరలు పెంచారా అని ప్రశ్నించారు. పెంచిన ధరలను ధరలను తక్షణ మే ఉప సంహరించుకొని సాధారణ జనానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబరు బత్తిని రాజు, కార్మికులు, మహి ళలు మమత, దేవమ్మ, పద్మ, లక్ష్మి, అంబులమ్మ, పాలెం దేవమ్మ పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 11:39 PM