Share News

kumaram bheem asifabad- వంట.. తంటా

ABN , Publish Date - Nov 22 , 2026 | 09:48 PM

విద్యార్థులకు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణను నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రభావితం చేస్తోంది. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండడం తలకు మించిన భారంగా మారిందని వంట కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

kumaram bheem asifabad- వంట.. తంటా
లోగో

- గుడ్డు ధర పైపైకి..

- ప్రభుత్వం ఇచ్చేది రూ.6..మార్కెట్లో ఒక్కోటి రూ.8

- ఆంధోళనలో మధ్యాహ్న భోజన కార్మికులు

బెజ్జూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణను నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రభావితం చేస్తోంది. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండడం తలకు మించిన భారంగా మారిందని వంట కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి శ్రమపడి వడ్డిస్తున్నా ఆర్థిక కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. పెరిగిన ధరలతో సమానంగా తమకు చెల్లించాల్సిన బిల్లులు పెంచాలని కోరుతు న్నారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి చెల్లిస్తునన్న ధర కంటే పెరిగిన ధరలతో రెండింతల ఖర్చవుతుందని, దీంతో అప్పులపాలవుతున్నామని చెబుతు న్నారు. పెరిగిన ధరలకు తోడు నెలల తరబడి బిల్లులు ఇవ్వడం లేదని వాపోతున్నారు.

- కొండెక్కిన కూరగాయలు..

వంటకు అవసరమైన టమాతా, వంకాయ, దోస కాయ, బెండకాయ, ఉల్లిగడ్డ ఇతర కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. అలాగే వంట చెరుకు కోసం బండెడు కట్టెల కు రూ.1000 అవు తోంది. గతేడాది వంట చెరుకు కోసం రూ.600 నుంచి రూ.800ఉండగా, ప్రస్తుతం రూ.1000 చెల్లించాల్సి వస్తోందని మధ్యాహ్న భోజన కార్మి కులు వాపోతున్నారు. ఇక కూరగాయల విషయా నికి వస్తే అధనంగా రూ.500ఖర్చవుతుందని చెబుతున్నారు. గతేడాది ఇదే సమయానికి కిలో టమాటా రూ.20ఉండగా ప్రస్తుతం రూ.50కి చేరింది. అలాగే ఆలుగడ్డ రూ.40, దోసకాయ ఒక్కటి రూ.20,బెండకాయ రూ.40, బీరకాయ రూ.50, పచ్చిమిర్చి రూ.80, ఎండుమిర్చి రూ. 250కి పెరగడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇక పప్పుల ధరలు, నూనెలు అమాంతతం పెరగడంతో ఏం తెచ్చి పెట్టాలో అర్థం కావడం లేదంటూ వాపోతున్నారు. ఇక కొత్తిమీర, మెంతి ధరలు విపరీతంగా ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.6ఇస్తుంది. 150మంది ఉంటే వారంలో మూడు సార్లు పెట్టాలంటే రూ.900, నెలలో 12రోజులకు రూ.3600ఇస్తుంది. కాగా వ్యాపారులు ఒక్కో గుడ్డను రూ.8కి విక్రయిస్తున్నారు. నెలలో 12రోజుల కు అంటే ఒక్కో గుడ్డకు అదనంగా రెండు రూపా యలు పెట్టాల్సి వస్తోంది. దీంతో నెలకు వేలాది రూపాయలు అధనంగా పెట్టాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 995 పాఠశాలలు ఉన్నాయి. 40,821మంది విద్యార్థులు ఉన్నారు. 995వంట ఏజెన్సీలు ఉన్నా యి. 1,495మంది వంట కార్మికులు పని చేస్తున్నా రు. ఈ ఏడాది నుంచి ఉపాధ్యాయులకు కూడా వంట చేసి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిం చింది. వీరికి భోజనం వడ్డించాలంటే మరింత అప్పుల పాలవుతున్నామని చెబుతున్నారు. ఉపాఽ ద్యాయులకు కూడా వారంలో మూడుసార్లు విధిగా గుడ్డు పెట్టాల్సిందేనని, ప్రభుత్వం గుర్తించి పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు పెంచాలని కోరు తున్నారు.

- చెల్లింపు ఇలా..

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వంట వారికి ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.6.78, 6నుంచి 10తరగతుల వారికి రోజుకు ఒక్కో విద్యార్థికి రూ. 10.17 ప్రభుత్వం చెల్లిస్తోంది. పెరిగిన గుడ్డు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, వంట చెరు కు ధరల భారం రోజురోజుకూ పెరుగుతుందని వాపోతున్నారు. పెరుగుతున్న ధర కారణంగా 9,10విద్యా ర్థులకు ఒక్కొక్కరికి రూ.18ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక వంట వారికి కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి జీతం ఇస్తుంది. ఈ జీతం కూడా వంట చెరుకుకు కూడా సరిపోవడం లేదని వాపోతున్నారు. పెరిగిన ధరల కారణంగా వీటిని పెంచితే మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ధరలను సవరిస్తే వేలాది మంది విద్యార్థులు లబ్దిపొందే అవకాశం ఉందని, ఏజెన్సీలు కూడా ఉత్సాహంగా పని చేసేందుకు ముందుకు వస్తారని చెబుతున్నారు.

ధరలు విపరీతంగా పెరిగాయి..

- గౌతురె లక్ష్మి, వంట కార్మికురాలు, బెజ్జూరు

కూరగాయలు, గుడ్లు, వంటనూనె ధరలు విపరీ తంగా పెరిగాయి. పెరిగిన ధరలను చూసి ప్రభు త్వం బిల్లులు పెంచి ఇవ్వాలి. గుడ్ల ధరలు పెరగ డంతో వారానికి రూ.300 భారం పడుతోంది. జీతం నెలకు కనీసం రూ.6వేలు ఇవ్వాలి. పెరిగిన ధరల కు అనుగుణంగా బిల్లులు పెంచాలి.

Updated Date - Nov 22 , 2026 | 09:48 PM