మహిళల ఆర్ధిక అభివృద్ధి దిశగా చేయూత
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:02 PM
మహిళల ఆర్ధిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేయూత అందిస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శి క్షణ, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.
మంత్రి వివేక్‌వెంకటస్వామి
చెన్నూరు, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి) : మహిళల ఆర్ధిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేయూత అందిస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శి క్షణ, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మం గళవారం చెన్నూరులోని మైనార్టీ ఫంక్షన్‌హాలులో జిల్లా మైనార్టీ సం క్షేమ శాఖ, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ర్పైన్యూర్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏర్పా టు చేసిన కుట్టు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి మా ట్లాడుతూ చెన్నూరుకు 400 కుట్టు మిషన్‌లను కేటాయించి మహిళ కు శిక్షణ అందిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళ లను వివిధ వ్యాపార రంగాల్లో రుణ సదుపాయం కల్పించి ప్రోత్స హిస్తున్నామన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ కుట్లు మిషన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి మిషన్‌లను అందిస్తామన్నారు. ప్రభుత్వం వివిధ రకాల వ్యాపారాల్లో మహి ళల భాగస్వామాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. అంతకుముందు చె న్నూరు మండంలోని సోమనపల్లిలో చేపట్టిన యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి, కలెక్టర్ పరిశీలించారు. ఈనెల 28 నుంచి జూన్ 28 వరకు పాఠశాలకు సంబంధించిన అ న్ని పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కా ర్యక్రమంలో అధికారులు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఆలీవ్ సంస్థ సంయుక్త కార్యదర్శి కవిత రాజేష్, జిల్లా మైనార్టీ అధికారి రాజేశ్వరి, డీఆర్‌డీవో కిషన్, డీపీవో వెంకటేశ్వర్‌రావు, రాంప్‌ప్రాజెక్టు అధికారి మహ్మద్ ఖాసీం, తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమి షనర్ మురళీకృష్ణ, చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్ పాల్గొన్నారు.