Share News

కాంట్రాక్టర్లు కావలెను...!

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:58 PM

మంచి ర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అండర్‌ గ్రౌండ్‌ విద్యుద్ధీకరణ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు దొర కడం లేదు. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుం డగా దాని ప్రభావం అంతర్గత రహదారులపై పడు తోంది.

 కాంట్రాక్టర్లు కావలెను...!

అండర్‌ గ్రౌండ్‌, విద్యుద్ధీకరణ పనులకు కలగని మోక్షం

రెండు సార్లు టెండర్లు పిలిచినా స్పందన కరువు

నిబంధనల మేరకు అర్హత గల వారు కరువు

పనులపై అవగాహన లేకపోవడమూ కారణమే

మూడో విడత టెండర్ల నిర్వహణకు ఏర్పాట్లు

మంచిర్యాల, అక్టోబర్‌ 29(ఆంధ్రజ్యోతి) : మంచి ర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అండర్‌ గ్రౌండ్‌ విద్యుద్ధీకరణ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు దొర కడం లేదు. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుం డగా దాని ప్రభావం అంతర్గత రహదారులపై పడు తోంది. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఎలక్ర్టిసి టీ పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగ ర్‌రావు ప్రత్యేక చొరవతో రూ.78 కోట్లు నిధులు మం జూరు చేయించారు. ఇందులో భాగంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావస్తున్న ప్పటికీ విద్యుద్ధీకరణ పనులు మాత్రం ప్రారంభం కా లేదు. అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ర్టిసిటీ పనులు పూర్తయితే రో డ్ల నిర్మాణానికి అవకాశం ఏర్పడుతుంది. గోదావరి పు ష్కరాలు వచ్చే ఏడాది నిర్వహించనుండగా ఆలోపే ఈ పనులన్నీ పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో అధికారు లున్నారు. నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎలక్ర్టిసిటీ ప నులకు మోక్షం కలగడం లేదు.

టెండర్లకు స్పందన కరువు....

అండర్‌ గ్రౌండ్‌ ఎలక్ట్రిసిటీ పనుల కోసం రూ. 38 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు రెండు మార్లు ఆ న్‌లైన్‌ విధానంలో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుం చిస్పందన లేకపోవడం గమనార్హం. కార్పొరేషన్‌ పరి ధిలోని శ్రీనివాస టాకీస్‌ రోడ్‌, వెంకటేశ్వర టాకీస్‌ రోడ్‌, కూరగాయల మార్కెట్‌ ఏరియా, రైల్వే స్టేషన్‌, బస్టాం డ్‌, తదితర ప్రధాన రహదారులలో అండర్‌ గ్రౌండ్‌, వి ద్యుద్ధీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందు కోసం గ త నెల 11వ తేదీన మొదటి దఫా, ఈ నెల 5వ తేదీ న రెండోసారి అధికారులు టెండర్లు ఆహ్వానించారు. అయితే రెండు సార్లు కూడా టెండర్‌దాఖలు కాకపోవ డంతో మూడోసారి టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ పనులకు సంబంధించి ఇప్ప టికే విద్యుత్‌శాఖ తరుపున అవసరమైన పనులు పూర్తి కాగా టెండరింగ్‌ దశలో ప్రక్రియ ఆగిపోయింది. ఈ అండర్‌ గ్రౌండ్‌, విద్యుద్ధీకరణ ద్వారా ఆయా ఏరియా లలో విద్యుత్‌ స్థంభాలు కాని, వైర్లు కాని ఎక్కడ కని పించవు. ఈ మాదిరి అండర్‌ గ్రౌండ్‌ విద్యుద్ధీకరణ ప నులు హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌తో పాటు మంచిర్యాలలో మాత్రమే చేపడుతుండగా స్థానికంగా ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు.

నిబంధనల వర్తించకపోవడంతోనే...

మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలో దశాబ్ధాలుగా కాం ట్రాక్టర్లు వివిధ రకాల అభివృద్ధి పనులను చేపడుతున్న ప్పటికీ అండర్‌ గ్రౌండ్‌ విద్యుద్ధీకరణ పనులు మొట్టమొ దటిసారిగా చేపట్టాల్సి రావడంతో ఆన్‌లైన్‌ టెండర్‌ ని బంధనలు వర్తించక పూర్వపు కాంట్రాక్టు ఎవరు ముం దుకు రావడం లేదు. దీనికి తోడు ఆయా పనులు చేసి న అనుభవం ఉన్న కాంట్రాక్టర్లుమాత్రమే పనులను చే పట్టాలనే నిబంధన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చో ట్ల మాత్రమే ఇలాంటి కీలకమైన పనులు జరుగు తుం డగా ఆ పనులన్నీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాం ట్రా క్టర్లే చేపడుతున్నారు. మంచిర్యాల లో అండర్‌ గ్రౌండ్‌ వి ద్యుదీకరణ పనులను చేపట్టేందుకు ఆంధ్ర కాంట్రాక్ట ర్లు కార్పొరేషన్‌ పరిధిలో పర్యటించినప్పటికీపనులను చేపట్టేందుకు వారు సముఖంగా లేరని తెలుస్తోంది. పనులు కొత్తగా చేపట్టడంతో వాటిపై అవగాహన లేక కొందరు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయకపోగా మరికొందరు నిర్ణయించిన అంచనా వ్యయం సరిపోదనే భావనతో ముందుకు రావడం లేదని తెలుస్తుంది. కాగా మూడోసారి టెండర్ల కోసం పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెం ట్లకు చెందిన ఇంజనీర్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) అనుమతి కూ డా లభించగా త్వరలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవ కాశాలున్నాయి. ఈసారైనా నిబంధనల మేరకు అర్హులై న కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేస్తారా...? అన్న సం దేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండ గా ఇప్పటికే రెండు సార్లు జరిగిన టెండర్లలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఈసారి నిర్వహించే ఆన్‌ లైన్‌ టెండర్లలో నిబంధనలు కొంత మేర సడలించ నున్నట్లు తెలుస్తోంది.

రహదారుల నిర్మాణంలో జాప్యం....

ఇప్పటికే అండర్‌ గ్రౌండ్‌ విద్యుద్ధీకరణ కోసం కంద కాలు తవ్వి దాదాపుగా పైపులైన్‌లు కూడా వేశారు. వి ద్యుద్ధీకరణ పూర్తయితే కందకాలన్నీ పూడ్చివేసిన అనం తరం ఆయా ఏరియాలలోని రహదారులన్నీ పునః ని ర్మించనున్నారు. ఇలా రహదారుల నిర్మాణానికి అండర్‌ గ్రౌండ్‌ విద్యుద్ధీకరణ పనులతో లంకె ఉండడంతో ప నులలో జాప్యం జరుగుతంది. మూడో దఫా టెండర్లు సజావుగా సాగి నిర్ణయించిన పనులు సకాలంలో పూ ర్తయితే అనుకున్న విధంగా గోదావరి పుష్కరాలలోపే రహదారుల నిర్మాణం కూడా పూర్తయే అవకాశాలు ఉ న్నాయి. మూడో దఫా టెండర్ల నిబంధనలో కొంత మేర సడలింపు ఇస్తున్నందున కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే అవకాశాలుంటాయనే ఆశాభావంతో అధికారులు ఉన్నారు.

Updated Date - Oct 29 , 2026 | 11:58 PM