Share News

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:35 PM

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తు న్న వారిని రెగ్యులర్‌ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు

నస్పూర్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తు న్న వారిని రెగ్యులర్‌ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు డిమాండ్‌ చేశారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టుచ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వారం రోజుల నుంచి చేస్తున్న దీక్ష శిబిరాన్ని శనివారం దివాకర్‌ రావు, నాయకుడు విజిత్‌ కుమార్‌లు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని హా మీ ఇచ్చి గెలిచిన తర్వాత హామీలను గాలికి వదిలిపెట్టారన్నారు. కాంట్రా క్టు ఉద్యోగులకు మద్దతుగా వారికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్‌, మంచిర్యాల పట్టణల అధ్యక్షు లు అక్కూరి సుబ్బయ్య, సత్యం, నాయకులు వంగ తిరుపతి, కార్యకర్తలు, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 11:35 PM