జంతు అక్రమ రవాణాపై నిరంతర నిఘా
ABN , Publish Date - May 19 , 2026 | 11:09 PM
రాబోయే బక్రీద్ పండగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా జంతు అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లుమంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు.
డీసీపీ భాస్కర్
కోటపల్లి, మే 19 (ఆంధ్రజ్యోతి) : రాబోయే బక్రీద్ పండగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా జంతు అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లుమంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. మంగళవారం మండలంలోని రాపనల్లి సమీపంలోని అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టును ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇతర శాఖల అధికారులతో సమన్వయంగా అక్రమ జంతు రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతుందని, జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌పరిధిలోని పశువుల సంతలు, బక్రీద్‌పండగ దృష్య్టాఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల పనితీరు తదితర అంశాలపై అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేయడం, వధించడం పూర్తిగా నిషేధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేశామని, ప్రతి చెక్‌పోస్టులో పోలీసు , ఇతర శాఖల సిబ్బంది 24 గంటల పాటు విదులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేస్తారన్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి అక్రమ ధాన్య ం రవాణా జరగకుండా వ్యవసాయ,రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని తనిఖీలు చేయాలని పోలీసులకు సూచించారు. ఆయన వెంట జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, కోటపల్లి, భీమారం ఎస్‌ఐలు రాజశేఖర్, రాజేందర్‌లు పాల్గొన్నారు.