నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:55 PM
పాఠశాలల్లో నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం తంగళ్లపల్లి గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ని ర్మిస్తున్న వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
తాండూర్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : పాఠశాలల్లో నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం తంగళ్లపల్లి గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ని ర్మిస్తున్న వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మా ణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సం ఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందించాలని సూచిం చారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాల యాన్ని సందర్శించారు. నూతనంగా నిర్మిస్తున్న భోజనశాల పనులను పరి శీలించి త్వరగా పనులను పూర్తి చేయాలని సూచించారు. వంట శాలను తనిఖీ చేసి ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలిం చి విద్యార్థులకు సరైన విద్యా వాతావరణం కల్పించడంలో నిర్లక్ష్యం వహించి నట్లు గుర్తించి సంబంధిత స్పెషల్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయా లని జిల్లా విద్యాశాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట అధి కారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.