kumaram bheem asifabad- మ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:03 PM
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పుర్వవైభవం దిశగా వెళుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్‌హాల్‌లో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుగుణ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జీ, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, పీసీసీ కార్యదర్శులు రాజేశ్వర్, అనిల్‌కుమార్‌లతో కలిసి హజరయ్యారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పుర్వవైభవం దిశగా వెళుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్‌హాల్‌లో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుగుణ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జీ, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, పీసీసీ కార్యదర్శులు రాజేశ్వర్, అనిల్‌కుమార్‌లతో కలిసి హజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో మళ్లీ పూర్వ వైభవం దిశగా వెళుతుందన్నారు. నూతనంగా జిల్లా కార్యవర్గంలో అవకాశం లభించిన ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర సామాజిక స్పృహ, ప్రజా సంక్షేమం దిశగా కొనసాగిందని చెప్పారు. అయన ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. గ్రామాలు దేశానికి గుండెలాంటివని గాంధీజీ చెప్పారని గుర్తు చేశారు. అయనను అనుసరించి కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని వివరించారు. జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం కేటాయించామని అన్నారు. పదవుల కేటాయింపులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రకటించామని చెప్పారు. పార్టీకి కార్యకర్తలు ముఖ్యమన్నారు. కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రం ఏర్పడినపుడు 68వేల కోట్ల అప్పు ఉంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ 8లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. అయన చేసిన అప్పులకు రూ. 6,500 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్రంలో కొనసాగిస్తున్నామని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. త్వరలో విమానశ్రయం రాబోతుందని చెప్పారు. మరో పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ మాట్లాడుతూ పార్టీ అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రాతినిధ్యం కల్పిస్తుందని చెప్పారు. అన్ని మతాలను కలుపుకొని ముందుకు సాగేదే కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ పార్టీ వైఖరి అన్నదమ్ముల మధ్య వైరం పెట్టే విధంగా ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఫాంహౌస్‌కే పరిమితమని ఏద్దేవ చేశారు. రాబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, అలాగే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం గౌడ సంఘం నాయకులు, ఇతరులు టీపీసీసీ మహేష్ కుమార్‌గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, మాజీ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, మాజీ జడ్పీ ఛైర్మన్ గణపతి, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు మంగ, దేవయ్య, విశ్వనాథ్, ఆత్మ చైర్మన్ శ్రీరామరావు, నాయకులు చిన్న మల్లన్న, బాలేష్‌గౌడ్, అబ్దుల్లా, తారీఖ్, మహేష్‌గౌడ్, గణేశ్ రాథోడ్ పాల్గొన్నారు.