Share News

మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:52 AM

మునిసిపల్‌ కార్పొరేషన్‌, మునిసిపాలిటీ ఎన్నికల్లో మొత్తంగా 120 స్థానాలకు అన్నీ గెలుచుకొని కాంగ్రెస్‌ క్లీన్‌స్వీ్‌ప చేస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌

  • బీజేపీ, బీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లే.. 3.15 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం: ఉత్తమ్‌

కోదాడ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ కార్పొరేషన్‌, మునిసిపాలిటీ ఎన్నికల్లో మొత్తంగా 120 స్థానాలకు అన్నీ గెలుచుకొని కాంగ్రెస్‌ క్లీన్‌స్వీ్‌ప చేస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లేనని, అభివృద్థి, సంక్షేమం అందిస్తున్న కాంగ్రె్‌సకు పట్టం కట్టాలనే అభిప్రాయానికి ఓటర్లు వచ్చారన్నారు. ఆదిలాబాద్‌, గద్వాల్‌, పరిగి నుంచి కోదాడ వరకు కాంగ్రె్‌సను గెలిపించాలనే స్పష్టతతో ఓటర్లు ఉన్నారన్నారు. ఓ పదేళ్లు కుటుంబపాలనలో నలిగామని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తోందన్న దృఢసంకల్పంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారన్నారు. గత ప్రభుత్వ హయంలో అర్హులకు రేషన్‌ కార్డులు అందలేదని, అర్హులైన కుటుంబ సభ్యులను రేషన్‌ కార్డులో నమోదు చేసే అవకాశం కూడా ఉండేదికాదని అన్నారు. గత ప్రభుత్వంతో ఏడాదికి రూ.12వేల కోట్లు ఖర్చు చేసి, 2.8కోట్ల మందికి దొడ్డు బియ్యం ఇచ్చేవారని, ఆ దొడ్డు బియ్యం తినలేక 90శాతం మంది లబ్ధిదారులు కిలో రూ.5 చొప్పున విక్రయించేవారన్నారు. దీంతో దొడ్డు బియ్యం పక్కదోవ పట్టి రైస్‌మిల్లర్లకు, బీర్ల కంపెనీలకు, పౌలీ్ట్ర ఫాంలకు వెళ్లేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇలాంటి అక్రమ వ్యాపారానికి దోహద పడిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక, ఉచిత బియ్యం పక్కదోవ పట్టొద్దన్న ఉద్దేశంతో సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా సన్నబియ్యం ఇస్తున్న దాఖలాలు లేవన్నారు. రూ.13,600కోట్లతో 3.15కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. పార్టీలతో ప్రమేయం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్‌కార్డు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు బోనస్‌ ఇవ్వడమే కాకుండా, సన్నధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు ఎక్కడా కష్టం కలగుకుండా చూస్తున్నామన్నారు. ప్రజాపాలన, సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రె్‌సకు పట్టణ ఓటర్లు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 03:52 AM