రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నాం
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:43 AM
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్..
మరి విభజన హామీల మాటేంటి?: కాంగ్రెస్
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు వారు అభినందనలూ తెలిపారు. అయితే రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు మాటేంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం తెలంగాణ పట్ల నిర్లక్ష్యంగా, వివక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. విభజన సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు... బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి ముఖ్యమైనవి అమలుకు నోచుకోలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ.. విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.