Share News

kumaram bheem asifabad- కాంగ్రెస్‌ వర్సేస్‌ బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Sep 09 , 2026 | 10:57 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. రెండు ప్రధాన పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రాజుకున్నాయి. అధికారంలోకి వచ్చాక తాము చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును ప్రధా నాంశంగా కాంగ్రెస్‌ విజయోత్సవాలు జరుపుతుండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలనే అస్ర్తాలుగా నిరసన కార్యక్ర మాలు చేపడుతోంది.

kumaram bheem asifabad-  కాంగ్రెస్‌ వర్సేస్‌ బీఆర్‌ఎస్‌
లోగో

- ప్రభుత్వ వైఫల్యాలే గులాబీ పార్టీ అస్త్రం

- అభివృద్ధి, సంక్షేమమే ప్రధానాంశమంటున్న హస్తం పార్టీ

బెజ్జూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. రెండు ప్రధాన పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రాజుకున్నాయి. అధికారంలోకి వచ్చాక తాము చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును ప్రధా నాంశంగా కాంగ్రెస్‌ విజయోత్సవాలు జరుపుతుండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలనే అస్ర్తాలుగా నిరసన కార్యక్ర మాలు చేపడుతోంది. ఇరు పార్టీల పోరు జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ పాకింది.

- హామీల అమలుపై..

జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతృత్వంలో ఆ పార్టీ వరుస నిరసనలు చేపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భం గా ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నా ప్రజలకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని నిలదీస్తున్నారు. ఇలా పలు కార్యక్రమాలతో ప్రజలను ఆకర్శించేందుకు యత్నించడమే కాకుండా పార్టీ కేడర్‌ను ఉత్తేజపరుస్తున్నారు. ప్రస్తుతం ఉద్యమమే రాజకీయ ఆక్సిజన్‌గా మారిన నేపథ్యంలో ప్రధానాం శాలనే అస్త్రంగా మలుచుకున్న బీఆర్‌ఎస్‌ రాజకీయ ఉనికిని చాటుకునేందుకు యత్నిస్తోంది.

- కాంగ్రెస్‌ ఎదురుదాడి..

ప్రతిపక్షాల విమర్శలను అధికఆర కాంగ్రెస్‌ తిప్పికొడుతోంది. సన్నబియ్యం, 200యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయా ణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ తదితర సంక్షేమ పథకా లే ప్రధానాంశంగా ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్‌ సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతోంది. క్షేత్రస్థాయిలో అమల వుతున్న సంక్షేమ ఫలాలను వివరించేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. అలాగే వెయ్యి రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేపడుతున్న పనులను వివిద ప్రచఆర మాద్యమాల ద్వారా ప్రజల్లోకి కాంగ్రెస్‌ చేరవేస్తోంది. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ చేసిన తప్పిదాలను తెరమీదకు తెస్తోంది.

- రాబోయే రోజుల్లో..

జిల్లాలో రాబోయే రాజకీయ సమీకరణాలను నిర్ణయించేది సభలు, ప్లెక్సీలు, ఆరోపణలు మాత్రమే కాదని విశ్లేషకులు అంటున్నారు. గ్రామాల్లో ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు...ఎవరి వెంట కేడర్‌ కదులుతోంది..స్థానిక సమస్యలపై ఎవరు నిరంతరం పోరాడుతున్నారు? అన్నదే కీలకమనే అభిప్రాయపడుతున్నారు. వెయ్యి రోజుల పాలనను కాంగ్రెస్‌ అభివృద్ధి రిపోర్టుగా చూస్తుంటే, బీఆర్‌ఎస్‌ దానిని ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టుకునే రాజకీయ అవకాశంగా చూస్తోందని అంటున్నారు. మొత్తం మీద జిల్లాలో మొదలైన వెయ్యి రోజుల పోరు భవిష్యత్‌ రాజకీయ ఆధిపత్యానికి ముందస్తు సంకేతంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ తన అధికార బలా న్ని, అభివృద్ధి ప్రచారంతో స్థిరీకరించుకోవాలని చూస్తుండగా, బీఆర్‌ఎస్‌ మాత్రం ఉద్యమాల ద్వారా కోల్పోయిన రాజకీయ స్థలాన్ని తిరిగి సంపాదిం చుకోవాలని చూస్తోంది.

Updated Date - Sep 09 , 2026 | 10:57 PM