కాంగ్రెస్ గెలుపు శాతం 63.7
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:42 AM
మునిసిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటిం ది. అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రె స్ వైపే మొగ్గుచూపారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్లుగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమీ కనిపించలేదు.
74 మునిసిపాలిటీల్లో విజయం.. మొత్తం వార్డుల్లో 52ు హస్తానికే
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటిం ది. అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రె స్ వైపే మొగ్గుచూపారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్లుగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమీ కనిపించలేదు. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. తాజాగా మునిసిపాలిటీల్లో 63.79 గెలుపు శాతంతో తన హవాను కొనసాగించింది. 2023డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 53.78 శాతంతో గెలుపొందింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 64 గెలుచుకుంది. ఇక బీఆర్‌ఎస్ 32.77 శాతంతో 39 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 5.88 శాతంతో 8 సీట్లు గెలుచుకోగా, సరిగ్గా మజ్లిస్ కూడా అన్నే స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 47.05ు స్ట్రైక్ రేటుతో 8 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ అనూహ్యంగా పుంజుకొని అదే శాతంతో 8 సీట్లు గెలుచుకుంది. బీఆర్‌ఎ్‌సకు కేవలం 16.68 శాతమే ఓట్లు రాగా, ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్‌ఎస్ ఏకంగా 21ు ఓట్లను కోల్పోయింది. కాగా, గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 56ు సర్పంచ్ స్థానాలను గెలుచుకోగా, బీఆర్‌ఎస్ 27.50ు పంచాయతీల్లో పాగా వేసింది. బీజేపీ 5.4ు, ఇతరులు 11.81ు స్థానాల్లో విజయం సాధించారు. తాజా మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2996 వార్డు లు, డివిజన్లు ఉండగా.. అందులో 1500 (50.06ు) స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని సత్తా చాటింది. మునిసిపాలిటీల్లో 52.22ు వార్డులను, కార్పొరేషన్లలో 42ు డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక బీఆర్‌ఎస్ మొత్తం వార్డులు, డివిజన్లలో కేవలం 718 స్థానాల్లో గెలుపొందింది. అంటే 27.81ు సీట్లను గెలుచుకుంది.
సీన్ రివర్స్..
గతంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో నాడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఏకపక్షంగా దూసుకుపోయింది. అప్పుడు కాంగ్రెస్ డీలా పడింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బీఆర్‌ఎస్ పూర్తిగా దిగజారిపోతే.. కాంగ్రెస్ పుంజుకుంది. ఐదేళ్ల క్రితం కేవలం ఆరు మునిసిపాలిటీలకే పరిమితమైన హస్తం పార్టీ ఇప్పుడు ఏకంగా 74 చోట్ల గెలిచింది. గతంలో ఒక్క కార్పొరేషన్‌ను కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు 3 చోట్ల విజయం సాధించింది. నాడు బీఆర్‌ఎస్ 4 కార్పొరేషన్లు గెలుచుకోగా.. ఇప్పుడు ఒక్కచోట కూడా పోటీ ఇవ్వలేకపోయింది. కార్పొరేషన్లలో బీఆర్‌ఎస్ కంటే బీజేపీ సత్తా చాటింది.