Share News

గద్దర్‌పై షా వ్యాఖ్యలు సరికాదు: మహేశ్‌గౌడ్‌

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:44 AM

ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు సరికావని, వాటిని ఖండిస్తున్నానని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు...

గద్దర్‌పై షా వ్యాఖ్యలు సరికాదు: మహేశ్‌గౌడ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజా యుద్ధనౌక గద్దర్‌పై పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు సరికావని, వాటిని ఖండిస్తున్నానని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ బతుకు చిత్రాన్ని.. గజ్జె కట్టి పాట రూపంలో ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి గద్దర్‌ అని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. గద్దర్‌ మరణించినప్పుడు ప్రధాని మోదీ సంతాప సందేశాన్ని పంపిన సంగతి అమిత్‌షాకు గుర్తు లేదా? అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్‌ ప్రశ్నించారు. గద్దర్‌కు మోదీ నక్సలైట్‌ అని సంతాపం తెలిపారా.. లేక ప్రజాగాయకునిగా గుర్తించి తెలిపారా? అన్నది అమిత్‌షా, బీజేపీ నేతలే చెప్పాలన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 02:44 AM