కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు గుణపాఠం చెప్పాలి
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:36 PM
తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులను ఎన్నికలల్లో ఓడించాలని బీఎస్పీ రాష్ట్ర కో అర్టినేటర్ రామచంద్రం పిలుపునిచ్చా రు.
బీఎస్పీ రాష్ట్ర కో అర్టినేటర్ రామచంద్రం
నస్పూర్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులను ఎన్నికలల్లో ఓడించాలని బీఎస్పీ రాష్ట్ర కో అర్టినేటర్ రామచంద్రం పిలుపునిచ్చా రు. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఆదిలా బాద్ జోన్ స్థాయి మున్సిపల్ ఎన్నికల సన్నా హక సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశానికి ముఖ్య అథితిగా హాజరైనా రామచం ద్రం మాట్లాడుతూ ఎన్నికల ముందు కామా రెడ్డిలో రేవంత్‌రెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చే స్తాన ని హామీ ఇచ్చారని, రెండేళ్లు గడిచినప్పటికీ నేటికి బీసీ కుల గణన చేపట్టలేదన్నారు. కాం గ్రెస్, బీజేపీ పార్టీలు బీసీలను మోసం చేస్తు న్నాయని, ఆ పార్టీల అభ్యర్థులకు మున్సిపల్ ఎన్నికలల్లో గుణపాఠం చెప్పాల న్నారు. ఈ సమావేశంలో జోన్ ఇంచార్జ్‌లు నీరడి ఈశ్వర్, గైని గంగాధర్, కాదాసి రవీంద ర్, జిల్లా ఇన్‌చార్జిలు దాగం శ్రీనివాస్, నాగుల కిరణ్ బాబు, జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసా ద్, నాయకులు ముల్కల సంపత్ కుమార్, దుర్గం తుకారం, సింగాడే పాండు, లక్ష్మి, జగన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.