Share News

హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:12 PM

అధికారంలో వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నా ఆ రు గ్యారెంటీలను విస్మరించి కాం గ్రెస్‌ ప్రభుత్వానికి మునిసిపల్‌ ఎ న్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.

హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
పట్టణంలోని 12వ వార్డులో కాలనీవాసుల సమస్యలను తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

- పట్టణంలో 12, 13 వార్డుల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మర్రి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : అధికారంలో వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నా ఆ రు గ్యారెంటీలను విస్మరించి కాం గ్రెస్‌ ప్రభుత్వానికి మునిసిపల్‌ ఎ న్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్‌ పట్టణం లోని 12, 13 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జ నార్దన్‌రెడ్డి పర్యటించారు. వార్డుల్లోని బొడ్రాయి, ఈదమ్మ, పొచమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజ లు చేసిన మాజీ ఎమ్మెల్యే కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో చేసిన అభి వృద్ధి పనులే కనిపిస్తున్నాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు వార్డుల్లో ఓట్ల అడుగడా నికి వస్తే ప్రజలు ప్రశ్నించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి వెంట మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బాబురావు, బీఆర్‌ఎస్‌ కొత్త గంగాధర్‌, ఎలిమె సత్యం పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 11:12 PM