Share News

కాంగ్రెస్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలి

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:03 PM

అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇష్టారీతిన దౌర్జన్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కాల నీలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లా డారు.

కాంగ్రెస్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలి
సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌

-బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : అధికార కాంగ్రెస్‌ పార్టీ ఇష్టారీతిన దౌర్జన్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కాల నీలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లా డారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ప్రభుత్వం ప్రజలకు చేసిందేమిలేదని పేర్కొన్నారు. అక్రమ మార్గంలో డబ్బులు పంపిణీ చేస్తూ ఓట్లు దండుకునేప్రయత్నం చేస్తుందని, ప్రజలు విజ్ఞులై ఓటుతోనే గుణపాఠం చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడు తూ మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రోద్బలంతో తమపార్టీకిచెందిన కార్పోరేటర్‌ అభ్యర్ధులను ప్రచారం చేయకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. ఈ సమావేశంలో నాయకులు విజిత్‌రావు, రవీందర్‌రెడ్డి, పల్లెభూమేష్‌, సురేందర్‌రెడ్డి తదితరులుపాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:04 PM