kumaram bheem asifabad- కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:20 PM
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండల కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి పాల్గొన్నారు
బెజ్జూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండల కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ పటిష్టం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కష్ట పడ్డ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు గుర్తింపు ఇస్తుందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి కట్టుగా పని చేసి అత్యధిక సీట్లు గెలిపించుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే పార్టీ లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుఏతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మండల కమిటీలు ఎన్నిక కోసం దరఖాస్తుల స్వీకరణ కంఒనసాగుతుందని అన్నారుర. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. కార్యక్రమంలో నాయకులు హర్షద్, శ్యాంరావు, శ్రీవర్ధర్, జగ్గాగౌడ్, విశ్వేశధ్వర్, నహిర్ అలీ, పుష్పలత, శంకర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా రాజన్న
పెంచికలపేట, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పెంచికలపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సముద్రాల రాజన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో నియామకం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పట్ల రాజన్న చేస్తున్న సేవలను గుర్తించి ఆనకు మండలాధ్యక్షుడి బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. అనంతరం ఆయనను సన్మానించి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సిడాం గణపతి, శ్యాంరావు, సర్పంచ్ ఉస్మాన్, రాజన్న, చంద్రమౌళి, సుధాకర్, మధునయ్య, సదాశివ్, శంకర్‌గౌడ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కౌటాల మండలాధ్యక్షుడిగా గంగారాం
కౌటాల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ కౌటాల మండలాధ్యక్షుడిగా నికోడే గంగారాంను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఎమ్మెల్సీ దండె విఠల్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకు ముందు బీఆర్‌ఎస్ నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాంతయ్య, తదితరులు పాల్గొన్నారు.