కాంగ్రెస్ శ్రేణుల నిరసన జ్వాల
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:21 PM
దేశం లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజీ వ్యవ హారాన్ని నిరసిస్తూ కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్ర దర్శన నిర్వహించారు.
- రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టుపై మండిపడ్డ నాయకులు
- ప్రధాని మోదీ, మంత్రులు అమిత్‌షా, ధర్మేంద్ర ప్రధాన్‌ల దిష్టిబొమ్మ దహనం
కొల్లాపూర్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : దేశం లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజీ వ్యవ హారాన్ని నిరసిస్తూ కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్ర దర్శన నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ కొల్లా పూర్ నియోజకవర్గ అధ్యక్షుడు అల్వాల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీంపాషా, మునిసిపల్ కౌన్సిలర్లు, యు వజన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రమేశ్‌గౌడ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ స్కామ్‌పై వి ద్యార్థులకు న్యాయం చేయాలని శాంతియుతం గా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనాయ కులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఢిల్లీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ని ర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొం తులను నొక్కేసేందుకు కుట్ర చేస్తోంది అని వారు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేస్తోందని మం డిపడ్డారు. కొల్లాపూర్ చౌర స్తాలో ప్రధానమంత్రి నరేం ద్రమోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఫ ఉప్పునుంతల, (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రమైన ఉప్పునుం తల అంబేడ్కర్ విగ్రహం దగ్గర డీసీసీ ఉపాధ్య క్షుడు కట్ట అనంతరెడ్డి, మండల అధ్యక్షుడు కర్నె లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ నరసిం హారెడ్డి, సర్పంచ్ చింగాల్ల శ్రీనివాసులు ఆధ్వర్యం లో ప్రధాని నరేంద్రమోదీ, మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌ల దిష్టిబొమ్మలను దహ నం చేశారు.
ఫ పదర, (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రం లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగెరస్ మండల అధ్యక్షుడు మాణిక్యం ఆధ్వర్యంలో ప్రధాన మం త్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశా రు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుఉ ఆనంద్, సర్పం చ్‌లు గేమానాయక్, భాస్కర్, కృష్ణవేణి, సాయి, ఎల్లమ్మ, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఫ వంగూరు, (ఆంధ్రజ్యోతి) : మండల కేం ద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేశ్‌గౌడ్, సలేశ్వరం, వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఫ చారకొండ, (ఆంధ్రజ్యోతి) : మండల కేం ద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకట్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి జమ్మికింది బాల్‌రాంగౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయిని జైపా ల్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని అన్నారు. ఫ నీట్ పరీక్ష లీక్ పత్రాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంట నే రాజీనామా చేయాలని పీఏసీఎస్ చైర్మన్ జెల్ల గురువయ్యగౌడ్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన లాఠీచార్జీని ఆయన తీవ్రంగా ఖండించారు.