Share News

నీట్‌ లీకేజీకి మోదీ, ప్రధాన్‌ బాధ్యత వహించాలి

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:33 AM

ప్రధాని మోదీ చేతకానితనం వల్ల కోట్ల కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని, నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీతో 40 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని...

నీట్‌ లీకేజీకి మోదీ, ప్రధాన్‌ బాధ్యత వహించాలి

  • ప్రశ్నార్థకంగా 40లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌

  • నిరసన ర్యాలీలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కవాడిగూడ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ చేతకానితనం వల్ల కోట్ల కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని, నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీతో 40 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. నీట్‌ లీకేజీ, ఎల్పీజీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు, సీబీఎ్‌సఈ వైఫల్యం, రూపాయి పతనం అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌ శనివారం ప్రదర్శన నిర్వహింది. బషీర్‌బాగ్‌ చౌరస్తాలోని బాబూజగ్జీవన్‌రాం విగ్రహం నుంచి లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ముఖ్య అతిథిగా హాజరైన మహే్‌షకుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ నీట్‌ లీకేజీపై ప్రధాని మోదీ ఇంకా కళ్లుమూకొని ఉన్నారని విమర్శించారు. నీట్‌ లీకేజీకి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పూర్తిబాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. దోషులను శిక్షించేంతవరకు, ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసేంతవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. లీకేజీ స్కాంలో కొంతమంది నిందితులను అరెస్ట్‌ చేసినా వారి వెనక ఉన్న శక్తులు ఎవరో తేల్చే పరిస్థితిలో కేంద్రం లేదని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే కేంద్రం ఎల్పీజీ, పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందనానరు. ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మోతే రోహిత్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌, ఏఐసీసీ కార్యాదర్శి సచిన్‌ సావంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 06:33 AM