Share News

గాంధీభవన్‌లో ‘సత్యాగ్రహ దీక్ష’

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:05 AM

తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని గాంధీ..

గాంధీభవన్‌లో ‘సత్యాగ్రహ దీక్ష’

  • మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణకునిరసనగా చేపట్టిన కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో శనివారం రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్‌ సంఘటన్‌ ఆధ్వర్యంలో ‘సత్యాగ్రహ దీక్ష’ నిర్వహించారు. ఈ దీక్షకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సంఘటన్‌ ఆల్‌ ఇండియా చైర్మన్‌ సునీల్‌ పన్వర్‌, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌తో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. జార్ఖండ్‌లో సరైన పత్రాలు లేని అభ్యర్థులకు ఎన్నికల అధికారి మరో అవకాశం ఇచ్చారని, కానీ ఎలాంటి తప్పులు, కేసులు లేని మీనాక్షి నటరాజన్‌ను మాత్రం కావాలనే తిరస్కరించారని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. అధికార పక్షం వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు.

Updated Date - Jun 21 , 2026 | 05:05 AM