Share News

కష్టపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీ అండ

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:33 PM

కష్టకాలంలో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని అచ్చంపేట ఎమ్మె ల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.

కష్టపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీ అండ
లింగాలలో కార్యకర్త సమస్యను వింటున్న అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

- అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

లింగాల, సెప్టెంబరు 20 (ఆంధ్ర జ్యోతి) : కష్టకాలంలో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని అచ్చంపేట ఎమ్మె ల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆది వారం మండల కేంద్రంలోని కార్యకర్తలతో స మావేశమై కార్యకర్తల సమస్యలను తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యప డవద్దని అ న్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యరక్తల వల్లే ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ఆరు గ్యారెంటీలను అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించడమే రాష్ట్ర ప్ర భుత్వ లక్ష్యమన్నారు. ప్రజా సమస్యలపై నిరం తరం పర్యవేక్షణ ఉంటుందని, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునీ కరణకు పూర్తి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. కార్యకర్తలు రాష్ట్ర అందించిన ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్‌, రైతు భరోసా పథకాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని సూచించారు. అచ్చంపేట నియోజకవ ర్గానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నా రు. కార్యకర్తల సమావేశంలో సర్పంచ్‌ ఈశ్వర మ్మ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నారాయణ గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు పూజారి వెంకటయ్య, ముక్తార్‌, అచ్చంపేట మార్కెట్‌ చైర్మన్‌ గోపా ల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 11:33 PM