Share News

మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు

ABN , Publish Date - Apr 20 , 2026 | 06:11 AM

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్‌, ఇండీ కూటమి వ్యతిరేకం కాదని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు

  • బీజేపీ దుష్ప్రచారాలను నమ్మొద్దు: చామల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్‌, ఇండీ కూటమి వ్యతిరేకం కాదని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మోదీ సర్కారు తీసుకువచ్చిన డీలిమిటేషన్‌కు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు డీలిమిటేషన్‌ చేసుకుని ఎప్పటికీ అధికారంలో ఉండాలని బీజేపీ భావించడం వల్లే తాము ఆ బిల్లును వ్యతిరేకించాల్సి వచ్చిందని, తమపై బీజేపీ చేస్తున్న దుష్ప్రరాలను నమ్మొద్దని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. వాస్తవానికి మహిళా రిజర్వేషన్‌ బిల్లు 2023లోనే పార్లమెంటు ఆమోదం పొందిందని, 2024 నుంచే దాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తమిళనాడు, బెంగాల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే పార్లమెంటు సమావేశాన్ని మోదీ పెట్టారని మండిపడ్డారు. ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని ఇద్దరు తప్ప లోక్‌సభ సభ్యులంతా ఒప్పుకున్నారని తెలిపారు.

Updated Date - Apr 20 , 2026 | 06:11 AM