Share News

కాంగ్రెస్‌ ఎన్నికల హామీలను నెరవేర్చాలి

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:52 PM

ఎన్నికల సందర్భంగా సింగరేణి కా ర్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ ఎన్నికల హామీలను నెరవేర్చాలి
మెమోరాండం ఇస్తున్న బీజేపీ నాయకులు

- సింగరేణిని ఏటీఎంలా వాడుతున్న సీఎం, డిప్యూటీ సీఎం

- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌

శ్రీరాంపూర్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సందర్భంగా సింగరేణి కా ర్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా వారు ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. ఎస్‌ఓ టు జీఎం సత్యనారాయణకు వినతిపత్రం అందిం చిన అనంతరం మాట్లాడారు. సింగరేణి క్వార్టర్లకు మరమ్మతులు చేయించాలని, సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. రిటైర్డ్‌ కా ర్మికులకు రెండు గుంటల భూమి ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసింద న్నారు. ప్రస్తుత ప్రభుత్వం సింగరేణి నిధులను ఇతర పథకాలను మళ్లిస్తోం దన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంస్థ ను ఏటీఏంలా వినియోగిస్తున్నారని దుయ్యబట్టారు. కాంట్రాక్టులు వారి బంధు వులకు, కుటుంబ సభ్యులకు అప్పగించి కంపెనీని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లూటీ చేసిన మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మంచిర్యాల జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనగం దుల కృష్ణమూర్తి, పానుగంటి మధు, సత్రం రమేష్‌, కుర్రె చక్రవర్తి, జీవీ ఆనంద్‌ కృష్ణ, కమలాకర్‌ రావు, మిట్టపల్లి మొగిలి, మద్ది సుమన్‌, సదయ్య, ఈర్ల సదానందం, బద్రి శ్రీకాంత్‌, మహేశ్వరి, జ్యోతి, విజయ, స్వప్న, పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 11:52 PM