Share News

పార్లమెంటులో చర్చలకు బీజేపీ తాళం

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:31 AM

పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న పరిస్థితులపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని....

పార్లమెంటులో చర్చలకు బీజేపీ తాళం

  • కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ఎద్దేవా

న్యూఢిల్లీ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న పరిస్థితులపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి తప్పుబట్టారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత్‌ విదేశాంగ విధానం, ఇంద న భద్రత, ఆర్థిక స్థిరత్వం, గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్న దాదాపు కోటి మంది భారతీయుల భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. మోదీ ప్రభుత్వ వైఖరి కారణంగా భారత్‌ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పక్కనబెట్టి అమెరికా, ముఖ్యంగా ట్రంప్‌ విధానాలకు లొంగిపోతున్నట్టుగా కనిపిస్తోందని సోమవారం ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు.

Updated Date - Mar 10 , 2026 | 03:31 AM