ప్రతిపక్షాల కుట్రలను ప్రజలే తిప్పికొడతారు
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:17 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మదిలో ఉండకూడదనే కుట్రతోనే కేటీఆర్, హరీశ్‌రావు విష ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.
కేటీఆర్, హరీశ్‌రావులది విషప్రచారం: చామల
మనువాదాన్ని మోస్తున్న మందకృష్ణ: ప్రీతం
సివిల్స్ ఫలితాల్లో బీసీల జైత్రయాత్ర: నిరంజన్
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మదిలో ఉండకూడదనే కుట్రతోనే కేటీఆర్, హరీశ్‌రావు విష ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని.. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలే తిప్పికొడతారని వ్యాఖ్యానించారు. 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గత రెండేళ్ల సంక్షేమం, అభివృద్ధిపై ప్రజల నాడిని తెలుసుకోనున్నట్లు తెలిపారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రగతిభవన్ కట్టుకుంది తప్ప ప్రజలకు ప్రగతిని అందించలేదని విమర్శించారు. బీజేపీ విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి మందకృష్ణ దళిత జాతికి ద్రోహం చేస్తున్నారని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ ఎందుకు అమలు కావడం లేదో ఆయనే సమాధానం చెప్పాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం డిమాండ్ చేశారు. అంబేడ్కర్‌వాదాన్ని వదిలేసి మందకృష్ణ ఇప్పుడు మనువాదాన్ని మోస్తున్నారని విమర్శించారు. సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చడంపై రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.