Share News

దేశాన్ని భ్రష్టు పట్టించిన మోదీ, షా: చామల

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:15 AM

మోదీ, అమిత్‌ షాలిద్దరూ బిల్లారంగాల్లా తయారై దేశాన్ని భ్రష్టు పట్టించారని, రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకున్నారని కాంగ్రెస్‌ ....

దేశాన్ని భ్రష్టు పట్టించిన మోదీ, షా: చామల

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): మోదీ, అమిత్‌ షాలిద్దరూ బిల్లారంగాల్లా తయారై దేశాన్ని భ్రష్టు పట్టించారని, రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకున్నారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి దుయ్యబట్టారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గతంలో గుజరాత్‌ సీఎంగా పారాచూట్‌ నాయకుడిలా వచ్చి మోదీ పదవి చేపట్టారని, కానీ రాహుల్‌ గాంధీని 2009లోనే మన్మోహన్‌సింగ్‌ వంటి వారు ప్రధాని కావాలని కోరినా త్యాగం చేశారని చెప్పారు. గత ఎన్నికల్లో బీజేపీకి పాస్‌ మార్కులే వచ్చాయని.. చంద్రబాబు, నితీశ్‌ కుమార్‌ వంటి వారి వల్లే మోదీ సర్కారు కొనసాగుతోందని ఆయన అన్నారు.

విద్యా కమిషన్‌ రిపోర్టు తయారీలో నాది చిన్న పాత్రే: కేకే

విద్యా కమిషన్‌ రిపోర్టు తయారీలో తన పాత్ర చాలా చిన్నదని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు స్పష్టం చేశారు. ఆ కమిషన్‌లో తానూ సభ్యుడిగా ఉన్నానని.. ఆకునూరి మురళి కమిషన్‌ చేసినది కేవలం సిఫార్సులేనని, తుది విద్యా పాలసీ కాదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల జీతాలపై రాజకీయ వర్గాలు, ఉద్యోగుల నుంచి వచ్చిన విమర్శలు సర్కారు దృష్టికి వచ్చాయని తెలిపారు. సచివాలయంలో కేకే మీడియాతో మాట్లాడారు. వచ్చే వా రంలోపే ఉపాధ్యాయ యూనియన్లను పిలిచి, రిపోర్టును వారి ముందుంచి ప్రభుత్వం చర్చించనుందన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 01:15 AM